అమరావతి భూముల విషయంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఏపీ ప్రభుత్వం పదే పదే ఆరోపించడాన్ని టీడీపీ నాయకురాలు, దివంగత నందమూరి హరికృష్ణ కూతురు సుహాసిని తప్పుబట్టారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగినట్టు సాక్ష్యాలు బయటపెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. అలా జరిగి ఉంటే చర్యలు తీసుకోవచ్చని వ్యాఖ్యానించారు. ఇదే విషయాన్ని ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా పలుసార్లు చెప్పారని గుర్తు చేశారు. మందడంలో దీక్ష చేపట్టిన రైతులకు నందమూరి సుహాసిని సంఘీభావం ప్రకటించారు. అమరావతినే ఏపీకి రాజధాని ఒక్కటే ఉండాలని ఆమె డిమాండ్ చేశారు. రాజధాని వస్తుందే కాబట్టే రైతుల భూములు ఇచ్చారని ఆమె తెలిపారు. రైతుల పోరాటం వల్ల కచ్చితంగా న్యాయం జరుగుతుందని ఆమె అన్నారు. మహిళల పట్ల పోలీసులు అరాచకంగా వ్యవహరిస్తున్నారని సుహాసిని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు తలుచుకుంటే రాజ్యాలు కూలిపోయాయని అన్నారు. జీఎన్ రావు కమిటీ బోగస్ కమిటీ అని విమర్శించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amaravati, Ap cm ys jagan mohan reddy, Nandamuri suhasini, Tdp