బాలకృష్ణ ఆ రికార్డ్ కొనసాగిస్తారా ? అపకీర్తిని మూటగట్టుకుంటారా ?

ఏపీలో టీడీపీకి ప్రతికూల పవనాలు వీస్తున్నాయనే వార్తల నేపథ్యంలో... బాలకృష్ణ హిందూపురం కంచుకోట బద్ధలు కాకుండా కాపాడతారా అనే ఊహాగానాలు మొదలయ్యాయి.

news18-telugu
Updated: May 1, 2019, 12:10 PM IST
బాలకృష్ణ ఆ రికార్డ్ కొనసాగిస్తారా ? అపకీర్తిని మూటగట్టుకుంటారా ?
నందమూరి బాలకృష్ణ(File)
  • Share this:
తన తండ్రి ఎన్టీఆర్ అడుగుజాడల్లో రాజకీయాల్లో అడుగుపెట్టిన టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ... టీడీపీ కంచుకోట హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ ఓటమి ఎరుగని హిందూపురంలో విజయం సాధించిన బాలకృష్ణ... తన తండ్రి ప్రాతినిథ్యం వహించిన హిందూపురం నుంచే మరోసారి బరిలోకి దిగారు. 2014లో గెలుపు కోసం బాగానే శ్రమించిన బాలయ్య... ఈ సారి కూడా విజయం కోసం బాగానే కష్టపడ్డారు. ఏపీలో టీడీపీకి ప్రతికూల పవనాలు వీస్తున్నాయనే వార్తల నేపథ్యంలో... బాలకృష్ణ హిందూపురం కంచుకోట బద్ధలు కాకుండా కాపాడతారా అనే ఊహాగానాలు మొదలయ్యాయి.

వాస్తవానికి హిందూపురం టీడీపీకి పెట్టని కోట. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హవా బలంగా వీచిన సందర్భాల్లోనూ ఆ పార్టీ హిందూపురంలో విజయం సాధించింది. 1989, 2004లో కాంగ్రెస్ భారీ మెజార్టీతో విజయం సాధించిన సమయంలోనూ హిందూపురం కంచుకోట బద్ధలుకాకుండా టీడీపీ కాపాడుకోగలిగింది. దీంతో ఈ సారి బాలకృష్ణ హిందూపురం నుంచి విజయం సాధించడన్నది కేవలం ఆయన కోసమే కాకుండా టీడీపీ ప్రతిష్టకు సంబంధించినదిగా ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.

ఒకవేళ బాలయ్య ఇక్కడి నుంచి పరాజయం పాలైతే... హిందూపురం టీడీపీ కంచుకోట నందమూరి వారసుడు పోటీ చేసినప్పుడే బద్దలైందనే అపకీర్తి బాలయ్య సొంతమవుతుందని ఆయన అభిమానులు, కార్యకర్తలు టెన్షన్ పడుతున్నారు. ఇటీవల నియోజకవర్గంలో పర్యటించి పోలింగ్ సరళిపై సమీక్షలు నిర్వహించిన బాలయ్య... మెజార్టీ తగ్గినా ఈ సారి కూడా గెలుపు తనదే అనే ధీమాలో ఉన్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. మొత్తానికి ఏపీలో టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చినా రాకపోయినా... హిందూపురంలో గెలుపు మాత్రం బాలయ్యకు అత్యంత కీలకమని చెప్పకతప్పదు.First published: May 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు