ఆ సంస్థ ఆస్తులపై వైసీపీ కన్ను...అందుకే ఆ మీటింగ్ అన్న టీడీపీ నేత

స్పీకర్‌ స్ధాయిలో ఉన్న వ్యక్తి రాజకీయాలు మాట్లాడటం సరికాదని టీడీపీ నేత కుటుంబరావు అన్నారు. వైకాపా ప్రభుత్వం కేవలం అగ్రిగోల్డ్‌పై రాజకీయం చేస్తోందని.... టీడీపీ ప్రభుత్వం 21 వేలకు పైగా ఎకరాల అగ్రిగోల్డ్‌ భూముల్ని జప్తు చేసిందని అన్నారు.

news18-telugu
Updated: November 9, 2019, 4:46 PM IST
ఆ సంస్థ ఆస్తులపై వైసీపీ కన్ను...అందుకే ఆ మీటింగ్ అన్న టీడీపీ నేత
అగ్రిగోల్డ్ లోగో
  • Share this:
అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకునేందుకు గత ప్రభుత్వ హయాంలోనే తాము బడ్జెట్‌లో నిధులు కేటాయించామని టీడీపీ నేత, ఏపీ ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు కుటుంబరావు వ్యాఖ్యానించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత... అంతా తామే చేసినట్లుగా గొప్పలు చెప్పుకుంటోందని ఆయన ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం విడుదల చేసిన డబ్బులు ఇచ్చారు తప్ప ఒక్క రూపాయి కూడా ఈ ప్రభుత్వం డబ్బు ఇవ్వలేదు. చెల్లించిన రూ.10 వేలు కూడా పూర్తికా ఇవ్వకుండా కొంతమందికి రూ.5 వేలు మాత్రమే ఇచ్చారని బాధితులే చెబుతున్నారని ఆరోపించారు.

ఇచ్చిన వారిలో అత్యధికులు వైసీపీ సానుభూతిపరులే ఉన్నట్లు బాధితులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారని కుటుంబరావు విమర్శించారు. జైలు నుంచి బెయిల్‌పై వచ్చిన అవ్వా సీతారామ్‌తో ఇప్పటి వైసీపీ మంత్రులు, పాత అషోషియేషన్‌ సభ్యులు కుమ్మక్కయి అగ్రిగోల్డ్‌ ఆస్తులు కాజేసేందుకు ప్రయత్నం చేసున్నారని ఆరోపణలు గుప్పించారు. జూలై మెదటి వారంలో అవ్వా సీతారామ్‌తో డీజీపీ ఆఫీసులో కొంతమంది వైసీపీ మంత్రులు మీటింగ్‌ ఏర్పాటు చేశారని... దీని గురించి కొన్ని పేపర్లలో ఆర్టికల్స్‌ కూడా రాశారని ఆయన ధ్వజమెత్తారు. గతంలో సీతారామ్‌పైనే ఆరోపణలు చేసిన వైసీపీ ఇప్పుడు ఆయనతో ఎందుకు సమావేశమైందని ప్రశ్నించారు.

స్పీకర్‌ స్ధాయిలో ఉన్న వ్యక్తి రాజకీయాలు మాట్లాడటం సరికాదని టీడీపీ నేత కుటుంబరావు అన్నారు. వైకాపా ప్రభుత్వం కేవలం అగ్రిగోల్డ్‌పై రాజకీయం చేస్తోందని.... టీడీపీ ప్రభుత్వం 21 వేలకు పైగా ఎకరాల అగ్రిగోల్డ్‌ భూముల్ని జప్తు చేసిందని అన్నారు. ఇప్పుడు ఏ ఎకరం ఏ వైసీపీ నేత కొట్టేస్తారో తెలీదని ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్‌, యనమల అగ్రిగోల్డ్‌ ఆస్తుల్ని కొట్టేయాలని చూసారని స్పీకర్‌ అన్నారని... దీనిపై ఆధారాలున్నాయా..? అని కుటుంబరావు ప్రశ్నించారు. అదే నిజమైతే... వైసీపీ అధికారంలోకి వచ్చి ఇంతకాలమైనా... దీనిపై ఎందుకు విచారణ చేయలేదని అన్నారు.
First published: November 9, 2019, 4:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading