మోదీకి జై కొడతానంటున్న టీడీపీ నేత.. అలా చేస్తే...

అలా జేస్తే మోదీకి జేజేలు పలుకుతానని చెప్పారు జేసీ. బయటకు వచ్చి మోదీ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తానని వెల్లడించారు.

news18-telugu
Updated: November 19, 2019, 9:06 PM IST
మోదీకి జై కొడతానంటున్న టీడీపీ నేత.. అలా చేస్తే...
ప్రధాని మోదీ, జేసీ దివాకర్ రెడ్డి
  • Share this:
కోల్డ్ వింటర్‌లో ఏపీ రాజకీయలు హీటెక్కాయి. ఓవైపు ఇసుక కొరత, ఇంగ్లీష్ మీడియంపై రచ్చ జరుగుతుండగానే.. మరోవైపు బీజేపీ, వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్‌‌కు తెరలేపాయి. టీడీపీ నుంచి నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే విజయవాడకు చెందిన యువనేత దేవినేని అవినాష్ వైసీపీ గూటకి చేరారు. ఇక టీడీపీకి రాజీనామా చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేన వంశీ త్వరలోనే వైసీపీలో చేరతానని ప్రకటించారు. మరికొందరు నేతలు కూడా పార్టీని వీడతారన్న వార్తలు టీడీపీ కేడర్‌ను కలవరపెడుతున్నాయి. ఈ క్రమంలో అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వరసగా మోదీని పొగుడుతున్నాడని.. ఆయన పార్టీ మారే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.

ఓ న్యూస్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పార్టీ మార్పు ఊహాగానాలపై స్పందించారు జేసీ దివాకర రెడ్డి. తాను బీజేపీలోకి వెళ్తున్నానన్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. మోదీ కొన్ని మంచి పనులు చేస్తున్నారని.. వాటిని మెచ్చుకున్నంత మాత్రం అలా అనుకోవడం కరెక్ట్ కాదన్నారు. పీవోకే (పాక్ ఆక్రమిత కాశ్మీర్) భారత్‌లో పూర్తిస్థాయిలో కలవలాని తాను కోరుకుంటున్నానని.. అలా జేస్తే మోదీకి జేజేలు పలుకుతానని చెప్పారు జేసీ. బయటకు వచ్చి మోదీ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తానని వెల్లడించారు. ఐతే ప్రస్తుతానికి మాత్రం టీడీపీలోనే ఉన్నానని క్లారిటీ ఇచ్చారు జేసీ దివాకర్ రెడ్డి.

First published: November 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...