టీడీపీకి మరో షాక్... నేడు జగన్‌కు జై కొట్టనున్న మాజీమంత్రి

ఇప్పటికే ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే, ఆ పార్టీ సీనియర్ నేత కరణం బలరాం సీఎం జగన్‌కు జై కొట్టారు.

news18-telugu
Updated: June 10, 2020, 6:58 AM IST
టీడీపీకి మరో షాక్... నేడు జగన్‌కు జై కొట్టనున్న మాజీమంత్రి
తెలుగుదేశం పార్టీ లోగో
  • Share this:
అధికారం కోల్పోయినప్పటి నుంచి టీడీపీకి అనేక మంది నాయకులు గుడ్ బై చెబుతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు టీడీపీని వీడకున్నా... పరోక్షంగా వైసీపీకి మద్దతు తెలుపుతుండగా... తాజాగా మరో మాజీమంత్రి కూడా వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. గత ఎన్నికల్లో టీడీపీకి కొద్దో గొప్పో చెప్పుకోదగ్గ ఫలితాలు వచ్చిన ప్రకాశం జిల్లాకు చెందిన ఆ పార్టీ ముఖ్య నేత, మాజీమంత్రి శిద్ధా రాఘవరావు... నేడు వైసీపీలో చేరబోతున్నారు. కుమారుడితో కలిసి ఆయన సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్నారు. ఇందుకు సంబంధించి మంత్రి బాలినేనితో నిన్న జరిపిన చర్చలు ఫలవంతం అయ్యాయి.

ఇప్పటికే ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే, ఆ పార్టీ సీనియర్ నేత కరణం బలరాం సీఎం జగన్‌కు జై కొట్టారు. ఆయన బాటలోనే జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు కూడా నడుస్తారని వార్తలు వచ్చాయి. అయితే తాను వైసీపీలో చేరబోనని సాంబశివరావు క్లారిటీ ఇచ్చారు. అయితే తాజాగా మాజీమంత్రి శిద్ధా రాఘవరావు వైసీపీలో చేరనుండటం టీడీపీకి పెద్ద దెబ్బగా మారనుంది. వాస్తవానికి గతంలోనే శిద్దా రాఘవరావు టీడీపీని వీడి వైసీపీలోకి వెళతారని వార్తలు వచ్చాయి. అయితే అప్పట్లో ఆయన వాటిని ఖండించారు. కానీ తాజాగా కుమారుడితో కలిసి వైసీపీలో చేరేందుకు ఆయన సిద్ధమయ్యారు.
Published by: Kishore Akkaladevi
First published: June 10, 2020, 6:54 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading