చంద్రబాబుకు మాజీమంత్రి షాకిస్తారా ?

ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత ప్రతిపాటి పుల్లారావు పార్టీ మారతారనే ప్రచారం జోరుగా సాగింది. ఆయన బీజేపీలోకి వెళతారని ఊహాగానాలు వినిపించాయి.

news18-telugu
Updated: November 27, 2019, 6:29 PM IST
చంద్రబాబుకు మాజీమంత్రి షాకిస్తారా ?
చంద్రబాబు నాయుడు(ఫైల్ ఫోటో)
  • Share this:
ఏపీలోని విపక్ష టీడీపీకి చెందిన నాయకుల్లో చాలామంది సైలెంట్ అయ్యారు. ఒకప్పుడు మంత్రిగా చక్రం తిప్పిన వారిలో కొందరు పూర్తిగా మౌనం దాల్చుతున్నారు. వారు పార్టీలో కొనసాగుతారా ? లేదా అనే అంశంపై చర్చ జరుగుతోంది. అలాంటి నాయకుల్లో గుంటూరు జిల్లాకు చెందిన మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఒకరు. ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత ప్రతిపాటి పుల్లారావు పార్టీ మారతారనే ప్రచారం జోరుగా సాగింది. ఆయన బీజేపీలోకి వెళతారని ఊహాగానాలు వినిపించాయి. బీజేపీలో చేరిన టీడీపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరితో ఆయన ఈ మేరకు చర్చలు కూడా జరిపారని టాక్ వినిపిస్తోంది.

అయితే తనకు అలాంటి ఆలోచన లేదని ప్రత్తిపాటి క్లారిటీ ఇచ్చారు. అయితే కొన్ని నెలలుగా ప్రత్తిపాటి పుల్లారావు టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం ఇప్పుడు పార్టీలో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఆయన తన సొంత నియోజకవర్గానికి కూడా అప్పుడప్పుడు మాత్రమే వచ్చి వెళుతున్నారని సమాచారం. దీంతో ప్రత్తిపాటి పుల్లారావుకు టీడీపీలో కొనసాగే ఆలోచన ఉందా ? లేదా ? అంశం మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

Prathipati Pulla Rao, Prathipati Pulla Rao to quit tdp, Prathipati Pulla Rao may join bjp, ysrcp, Chilakaluripet, ap news, telugu news, ప్రతిపాటి పుల్లారావు, ప్రతిపాటి పుల్లారావు రాజీనామా, టీడీపీ, వైసీపీ, బీజేపీ, చిలకలూరిపేట, తెలుగు న్యూస్,
ప్రత్తిపాటి పుల్లారావు (ఫైల్ ఫోటో)


టీడీపీలో కొంతకాలం సైలెంట్‌గా ఉండి... ఆ తరువాత పార్టీ మారాలనే యోచనలో ఆయన ఉన్నట్టు కనిపిస్తోందనే ఊహాగానాలు కూడా మరోసారి జోరందుకున్నాయి. మొత్తానికి టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు గుంటూరు జిల్లాలో కీలకంగా వ్యవహరించిన ప్రత్తిపాటి పుల్లారావు చంద్రబాబుకు షాకిచ్చి బీజేపీలో వెళతారా అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.
Published by: Kishore Akkaladevi
First published: November 27, 2019, 6:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading