Home /News /politics /

TDP LEADER EX MINISTER NARA LOKESH TARGETS ANDHRA PRADESH CHIEF MINISTER YS JAGAN MOHAN REDDY BS

జగన్ గారూ.. ఏం విన్నారు? ఎక్కడున్నారు?.. ఏపీ సీఎంపై నారా లోకేశ్ విసుర్లు

సీఎం జగన్ ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ విషయంలోనూ ఇలానే తొందరపడి తప్పుడు నిర్ణయం తీసుకుని మొట్టికాయలు తిన్నారని లోకేశ్ అన్నారు. ఇప్పుడు మూడు ముక్కలాటలో మరోసారి వైసీపీ ప్రభుత్వానికి భంగపాటు తప్పదని హెచ్చరించారు.

సీఎం జగన్ ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ విషయంలోనూ ఇలానే తొందరపడి తప్పుడు నిర్ణయం తీసుకుని మొట్టికాయలు తిన్నారని లోకేశ్ అన్నారు. ఇప్పుడు మూడు ముక్కలాటలో మరోసారి వైసీపీ ప్రభుత్వానికి భంగపాటు తప్పదని హెచ్చరించారు.

ప్రజలు తమ బాధలు చెప్పుకుంటుంటే.. అన్నింటికీ గత ప్రభుత్వమే కారణం అంటూ విమర్శలు చేస్తున్నారు తప్ప.. బాధలు తీర్చడం లేదని టీడీపీ నేత నారా లోకేశ్ ఏపీ సీఎం జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేశ్ నిప్పులు చెరిగారు. ప్రజలు తమ బాధలు చెప్పుకుంటుంటే.. అన్నింటికీ గత ప్రభుత్వమే కారణం అంటూ విమర్శలు చేస్తున్నారు తప్ప.. బాధలు తీర్చడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు వైసీపీ అధికారంలో ఉందన్న సంగతి మర్చిపోయారా? ఎద్దేవా చేశారు. ‘విత్తనాలో జగన్ ప్రభో అని రైతులు గగ్గోలు పెడుతుంటే చంద్రబాబు వల్లే విత్తనాలు ఇవ్వలేకపోతున్నామంటున్నారు. ఒకటో తారీఖుకు వచ్చే పింఛను రాలేదేమంటూ నిలదీస్తే.. గత ప్రభుత్వం వల్లే ఆలస్యం అయ్యిందని సమాధానం ఇస్తున్నారు. బీమా రాలేదు.. మా బతుకుల ధీమా ఏదంటే.. తెలుగు దేశం సర్కారు వల్లే అంటూ మాట దాటేస్తున్నారు.’ అంటూ విమర్శించారు.

‘నేను విన్నాను.. నేను ఉన్నానంటూ సీఎం అయ్యి, పాలన చేతకాక.. ఇప్పుడు చంద్రబాబే వింటాడు..చంద్రబాబే ఉంటాడు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికారం వెలగబెడుతున్నది టీడీపీనా? వైసీపీనా?’ అని లోకేశ్ నిలదీశారు.


Published by:Shravan Kumar Bommakanti
First published:

Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Chandrababu naidu, Nara Lokesh, Tdp, Ycp

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు