చంద్రబాబు ఇల్లు ముంచేందుకే వరద... టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు

కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున వరద వస్తోందని తెలిసినా... శ్రీశైలం నిండే వరకు చూశారని ఉమ ఆరోపించారు. శ్రీశైలం దగ్గర కావాలనే నీటిని నిలిపి కావాలనే వరదను అమరావతికి తీసుకొచ్చారని తీవ్ర ఆరోపణలు చేశారు.

news18-telugu
Updated: August 16, 2019, 12:38 PM IST
చంద్రబాబు ఇల్లు ముంచేందుకే వరద... టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబు, లింగమనేని గెస్ట్ హౌస్
news18-telugu
Updated: August 16, 2019, 12:38 PM IST
టీడీపీ సీనియర్ నేత, ఏపీ సాగునీటి శాఖ మంత్రి దేవినేని ఉమ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటిని ముంచేందుకే ప్రభుత్వం వరదను నియంత్రిస్తోందని ఆయన మండిపడ్డారు. ఒక ప్రణాళిక లేకుండా కృష్ణా నీటిని విడుదల చేశారని దేవినేని ఉమ ధ్వజమెత్తారు. కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున వరద వస్తోందని తెలిసినా... శ్రీశైలం నిండే వరకు చూశారని ఉమ ఆరోపించారు. శ్రీశైలం దగ్గర కావాలనే నీటిని నిలిపి కావాలనే వరదను అమరావతికి తీసుకొచ్చారని తీవ్ర ఆరోపణలు చేశారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ‌నీటిని ముందుగానే విడుదల చేసి ఉంటే పరిస్థితి ఈ రకంగా ఉండేది కాదని వ్యాఖ్యానించారు.

రాజధాని భూములు మునిగేలా చేసి... రాజధానిని ఇడుపులపాయకు తీసుకెళ్లాలని సీఎం జగన్ కుట్ర చేస్తున్నారని దేవినేని ఉమ మండిపడ్డారు. శ్రీశైలం నుంచి సోమశిల వరకు నీరు తీసుకెళ్లి ఉంటే ఆయా ప్రాంతాలకు కూడా నీరు వచ్చేదని అన్నారు. కేవలం చంద్రబాబు ఇల్లు మునిగేందుకు వైసీపీ ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరించిందని అన్నారు. టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని ప్రాంతాలను కూడా ముంచేశారని ఆరోపించారు. వరదపై ముఖ్యమంత్రి, సాగునీటి శాఖ మంత్రి రివ్యూ చేయలేదని... మంగళగిరి ఎమ్మెల్యే వరదపై ఎలా రివ్యూ చేస్తారని దేవినేని ఉమ ప్రశ్నించారు.


First published: August 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...