సీఎం జగన్‌ నిర్ణయాన్ని స్వాగతించిన చంద్రబాబు

దేశంలో ఇప్పటికే ఎన్నో చట్టాలున్నాయని.. వాటన్నింటినీ అధ్యయనం చేసి అవసరమైతే కేంద్రాన్ని కూడా సంప్రదించాలని సూచించారు మాజీ సీఎం. సభలో చట్టాలు చేయడం ఎంత ముఖ్యమో.. వాటి వల్ల సమస్యలను అధిగమించి, అమలు చేయడం అంతే ముఖ్యమని అభిప్రాయపడ్డారు.

news18-telugu
Updated: December 13, 2019, 3:38 PM IST
సీఎం జగన్‌ నిర్ణయాన్ని స్వాగతించిన చంద్రబాబు
చంద్రబాబు, సీఎం జగన్
  • Share this:
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమై ఇవాళ్టికి ఐదు రోజులవుతోంది. ఇన్ని రోజులు సభలో రచ్చ తప్ప చర్చకు పెద్దగా తావులేకుండాపోయింది. ఇంగ్లీష్ మీడియంపై చర్చ జరిగినప్పటికీ.. అధికార, విపక్షాల పరస్పర మాటల దాడికే అది సరిపోయింది. ఆ తర్వాత చంద్రబాబుపై అధికారపక్ష సభ్యుల సెటైర్లు, స్పీకర్‌పై చంద్రబాబు ఆగ్రహం, మార్షల్స్‌తో టీడీపీ సభ్యుల ఘర్షణ.. వీటిపైనే సభలో రచ్చ జరిగింది. ఐతే ఐదు రోజు ఎట్టకేలకు సభలో మహిళల భద్రతపై అర్ధవంతమైన చర్చ జరిగింది.

శుక్రవారం ఏపీ అసెంబ్లీలో 'దిశ' బిల్లును ప్రవేశపెట్టారు హోంమంత్రి సుచరిత. ఆ బిల్లుకు శాసన సభ ఆమోద ముద్రవేసింది. దీనిపై చర్చ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. దిశ బిల్లును స్వాగతిస్తున్నామని చెప్పారు. దిశ చట్టాన్ని ఏపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేయాలని కోరారు. దేశంలో ఇప్పటికే ఎన్నో చట్టాలున్నాయని.. వాటన్నింటినీ అధ్యయనం చేసి అవసరమైతే కేంద్రాన్ని కూడా సంప్రదించాలని సూచించారు మాజీ సీఎం. సభలో చట్టాలు చేయడం ఎంత ముఖ్యమో.. వాటి వల్ల సమస్యలను అధిగమించి, అమలు చేయడం అంతే ముఖ్యమని అభిప్రాయపడ్డారు. మహిళాపై అఘాయిత్యాలకు పాల్పడే ఎంతటి వారినైనా కఠినంగా శిక్షలు విధించే పరిస్థితి ఉండాలన్నారు చంద్రబాబు.


First published: December 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>