లగడపాటి సర్వేకు మించి సీట్లు వస్తాయి ....టీడీపీ నేత జోస్యం

టీడీపీ ఎన్నికల గుర్తు

డీపీ నేతలంతా కాలర్ ఎత్తుకొని తిరగాలన్నారు బుద్ధా వెంకన్న. మే 23న ఏర్పాటయ్యేది తెలుగుదేశం ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు బుద్ధ.

  • Share this:
    రానున్న ఎన్నికల ఫలితాల్లో టీడీపీ విజయాన్ని ఎవర అడ్డుకోలేరన్నారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న.లగడపాటి రాజగోపాల్ సర్వేకు మించి టీడీపీకి సీట్లు వస్తాయన్నారు. టీడీపీ 130 స్థానాల్లో విజయం సాధిస్తుందన్నారు. ఏపీ ప్రజలు సంక్షేమాన్ని...చంద్రబాబును నమ్మారన్నారు. వైసీపీ దారుణంగా ఓడిపోవయడం ఖాయమని చెప్పారు. ఈ విషయం జగన్‌కు కూడా తెలుసునన్నారు. టీడీపీ శ్రేణుల్లో గెలుపుపై ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు. ఈరోజు నుంచే విజయోత్సవాలు చేసుకొండంటూ కార్యకర్తలకు బుద్ధా పిలుపునిచ్చారు. టీడీపీ నేతలంతా కాలర్ ఎత్తుకొని తిరగాలన్నారు.మే 23న ఏర్పాటయ్యేది తెలుగుదేశం ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు బుద్ధ. మరోవైపు కేంద్రంలో మోదీ కుట్రలు చేస్తున్నారన్నారు. కేంద్రంలో ఒకవేళ బీజేపీకి తక్కువ స్థానాలు వస్తే... ప్రాంతీయ పార్టీలను దగ్గర చేసుకునేలా పావులు కదుపుతున్నారని ఆరోపించారు. అందుకే మోదీ జగన్‌కు సహకరిస్తున్నాన్నారు. తాజాగా వచ్చిన ఎగ్జిట్ పోల్స్‌లో లగడపాటి సర్వే ప్రకారం అత్యథిక స్థానాల్లో టీడీపీదే విజయమన్నారు.

    మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఎగ్జిట్ పోల్స్‌పై స్పందించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎగ్జిట్ పోల్స్‌పై స్పందించారు. ప్రజల నాడి పట్టుకోవడంలో ఎగ్జిట్ పోల్స్ విఫలం అయ్యాయని చంద్రబాబు అన్నారు. ‘ప్రజల నాడి పట్టుకోవడంలో ఎగ్జిట్ పోల్స్ చాలా సార్లు విఫలం అయ్యాయి. వాస్తవ పరిస్థితికి దూరంగా, భిన్నంగా ఎగ్జిట్ పోల్స్ వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే, ఎలాంటి అనుమానం లేకుండా ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది.
    First published: