సీఎం జగన్‌ను అభినందించిన టీడీపీ నేత

‘నవతర్నాలు’లో చాలా రత్నాలను తమ ప్రభుత్వం హయాంలో అమలు చేశామన్నారు బుద్ధా. ఇవేవో కొత్తగా అమలు చేసే పథకాలని.. కేవలం పేర్లు మాత్రంమే మార్చారని అన్నారు.

news18-telugu
Updated: June 14, 2019, 3:22 PM IST
సీఎం జగన్‌ను అభినందించిన టీడీపీ నేత
సీఎం వైఎస్ జగన్
news18-telugu
Updated: June 14, 2019, 3:22 PM IST
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని టీడీపీ నేత బుద్ధా వెంకన్న ప్రశంసించారు. పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించనన్న జగన్ వ్యాఖ్యలను ఆయన అభినందించారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన... అసెంబ్లీలో పార్టీ ఫిరాయింపులను తాను వ్యక్తిగతంగా అభినందిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డారు బుద్ధా వెంకన్న. ఎనిమిది మంది టీడీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారంటూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు కరెక్టు కాదని అన్నారు. నిన్న అసెంబ్లీలో మాజీ చంద్రబాబు గురించి అధికార పక్ష సభ్యులు హేళనగా మాట్లాడటం సబబు కాదని బుద్ధా వెంకన్న పేర్కొన్నారు.

ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగంపై కూడా బుద్ధా స్పందించారు. నరసింహన్ ప్రసంగం కేవలం ‘నవరత్నాలు’పైనే ఉందని విమర్శించారు. మిగతా విషయాల గురించి గవర్నర్ పెద్దగా మాట్లాడలేదని ఆరోపించారు. ‘నవతర్నాలు’లో చాలా రత్నాలను తమ ప్రభుత్వం హయాంలో అమలు చేశామన్నారు బుద్ధా. ఇవేవో కొత్తగా అమలు చేసే పథకాలని.. కేవలం పేర్లు మాత్రంమే మార్చారని అన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి పదిపదిహేను రోజులే మాత్రమే అయ్యింది కాబట్టి... ప్రభుత్వ వైఖరి ఎలా ఉంటుందో వేచి చూస్తామని, ఇప్పుడే విమర్శలు గుప్పించడం కరెక్టు కాదని అన్నారు బుద్ధా. ఇరిగేషన్ కు తక్కువ ప్రాధాన్య ఇచ్చారన్నారని ఆరోపించారు. గతంలో అనేకసార్లు బుద్ధా వెంకన్న జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. తాజాగా జగన్‌పై ఆయన ప్రశంసలు కురిపించడంతో అంతా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

First published: June 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...