వాళ్లను కూడా బెదిరిస్తున్న 420 బ్యాచ్... మండిపడ్డ టీడీపీ నేత

420 బ్యాచ్ ఆఖరికి కోర్టులను, జడ్జిలను బెదిరించే స్థాయికి వెళ్లిపోయారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ట్విట్టర్ వేదికగా విమర్శించారు.

news18-telugu
Updated: April 16, 2020, 4:19 PM IST
వాళ్లను కూడా బెదిరిస్తున్న 420 బ్యాచ్... మండిపడ్డ టీడీపీ నేత
బుద్దా వెంకన్న
  • Share this:
వైసీపీ నేతలపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మండిపడ్డారు. 420 బ్యాచ్ ఆఖరికి కోర్టులను, జడ్జిలను బెదిరించే స్థాయికి వెళ్లిపోయారని ఆయన ట్విట్టర్ వేదికగా విమర్శించారు. వీళ్లపై చర్యలు తీసుకోకపోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని అన్నారు. జైలులో ఉండాల్సిన నిందితులు బయట ఉంటే సమాజానికి ఎంత ప్రమాదమో జగన్, విజయసాయిరెడ్డిని చూస్తుంటే అర్థమవుతోందని బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు. కోర్టులు, న్యాయవాదులు, జడ్జిలపై దాడికి పాల్పడే విధంగా నాయకులు, కార్యకర్తలను రెచ్చగొట్టి ఉన్మాదంగా వ్యవహరిస్తున్న11 కేసుల్లో ఏ1గా ఉన్న జగన్, ఏ2 విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.First published: April 16, 2020, 4:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading