పార్టీ మార్పుపై బోండా ఉమా క్లారిటీ... చంద్రబాబును కలిశాకే నిర్ణయం

ప్రస్తుతానికి ఈ విషయంపై తానేం మాట్లాడనన్నారు. సోమవారం నాడు చంద్రబాబుతో భేటీ అవుతున్నన్నానని బోండా ఉమా తెలిపారు.

news18-telugu
Updated: August 11, 2019, 11:03 AM IST
పార్టీ మార్పుపై బోండా ఉమా క్లారిటీ... చంద్రబాబును కలిశాకే నిర్ణయం
బోండా ఉమా, చంద్రబాబు
  • Share this:
గత కొన్ని రోజులుగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా పార్టీ మారుతున్నారన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. దీంతో తాను పార్టీ మారుతున్నట్టు వచ్చిన వ్యాఖ్యలపై విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ స్పందించారు. ప్రస్తుతానికి ఈ విషయంపై తానేం మాట్లాడనన్నారు. సోమవారం నాడు చంద్రబాబుతో భేటీ అవుతున్నన్నానని, ఆ తరువాత మీడియాతో మాట్లాడతానని చెప్పుకొచ్చారు.  పార్టీ మారుతున్నట్లు తాను ఎన్నడూ చెప్పలేదని, మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయన్నారు బోండా.

ఇటీవలే విదేశాలకు వెళ్లి, తిరిగి వచ్చిన బోండా ఉమా శనివారం నాడు పార్టీ విజయవాడ పట్టణ అధ్యక్షుడు బుద్ధా వెంకన్నను కలిశారు. ఆపై బుద్ధా వెంకన్న మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు సూచనల మేరకే తాను ఉమను కలిశానని తెలిపారు . బొండా ఉమ టీడీపీలోనే కొనసాగుతారని బుద్ధా వెంకన్న స్పష్టం చేశారు. అయితే చంద్రబాబుతో భేటీ తర్వాత బోండా ఉమా ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారన్న అంశం ఇప్పుడు హట్ టాపిక్‌గా మారింది. గతంలో వైసీపీ నేతలపై తీవ్రమైన ఆరోపణలే చేశారు. అసెంబ్లీలో ఏకంగా రౌడీ భాష ఉపయోగించారు. అలాంటి ఉమను వైసీపీలో చేర్చుకుంటారా అన్న విమర్శలు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఏదీ ఏమైనా పార్టీ మారే విషయంపై బోండా ఉమ పునరాలోచనలో పడ్డట్లు సమాచారం.

First published: August 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>