జగన్‌కు బిగ్ షాక్... బెయిల్ రద్దు చేసే ఆలోచనలో సీబీఐ ?

సీఎం జగన్

సీబీఐ, ఈడీలను కేంద్ర హోంశాఖ ఆదేశించిందంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున కొందరు పోస్టులు పెడుతున్నారు.

 • Share this:
  ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మరోసారి జైలుకెళ్లనున్నారా? జగన్ బెయిల్ రద్దు కానుందా ? జగన్ విషయంలో కేంద్రం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందా ? సీబీఐ త్వరంలో జగన్ బెయిల్ రద్దు చేయాలని కోర్టును కోరనుందా? గత రెండు రోజులుగా ఇదే అంశంపై సోషల్ మీడియాలో రకరకాలుగా వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఇంతలో ఎంత నిజమన్న విషయం పక్కన పెడితే... కేంద్ర ప్రభుత్వం... సీరియస్ కేసుల్లో బయటున్న నిందితుల బెయిల్స్ రద్దు కోసం కోర్టుల్లో పిటిషన్ వేయాలంటూ సీబీఐ, ఈడీలను కేంద్ర హోంశాఖ ఆదేశించిందంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున పోస్టులు పెడుతున్నారు.

  అందులో ప్రముఖంగా ఏపీ సీఎం జగన్ పేరు కూడా వినిపిస్తుంది. దీంతో మళ్లీ జగన్ జైలుకెళ్లడం ఖాయమంటూ ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే తనను వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ జగన్ సీబీఐ కోర్టుకు పలుసార్లు కోరారు. అంతేకాదు... ఢిల్లీకి వెళ్లి పలువురు పెద్దల్ని కూడా కోరినట్లు సమాచారం. అయినా ఫలితం లేకుండా పోయింది. వ్యక్తిగత హాజరు నుంచి జగన్‌కు మినహాయింపు ఇచ్చేందుకు కోర్టు నో చెప్పింది. దీంతో త్వరలోనే జగన్‌కు ఇచ్చే బెయిల్ కూడా రద్దు చేయాలంటూ సీబీఐ పిటిషన్ వేసే అవకాశముందంటూ జోరుగా ప్రచారం చేస్తున్నారు.

  మరోవైపు టీడీపీ సీనియర్ నేత బోండా ఉమా కూడా ఇలాంటి పోస్టే ఒకటి పెట్టారు. జగన్ బెయిల్ రద్దుకు సీబీఐ పావులు కదుపుతోందని, విజయసాయిరెడ్డి చేసిన విజ్ఞప్తిని కేంద్రం సున్నితంగా తిరస్కరించిందంటూ ఆయన ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో కోనీ సోషల్ మీడియాలో ఆ పోస్టుని ఆయన డిలీట్ చేశారు. ఈ మొత్తం డ్రామాపై వైసీపీ శ్రేణులు జగన్ అభిమానులు మాత్రం మండిపడుతున్నారు. ఒకవైపు కేసుల విచారణ కొనసాగుతుండగా జగన్ బెయిల్ ఎందుకు రద్దు చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు.

  అయితే ఇదంతా ఫేక్ న్యూస్ అని...ప్రతిపక్ష టీడీపీ సోషల్ మీడియాలో చేస్తున్న దుష్ప్రచారం అని కొట్టి పారేస్తున్నారు. జగన్ విషయంలో అలాంటి అనుమానాలు అవసరం లేదని కొందరు రాజకీయ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం టీడీపీ పరిస్థితి చూస్తే అయోమయంగా ఉంది. సొంత పార్టీలోనే రెబల్స్ తయారవ్వడం... మరోవైపు పార్టీ నుంచి జోరుగా వలసలు కూడా పెరిగిపోవడంతో... పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకే టీడీపీ ఇలాంటి ప్రచారం చేస్తుందంటున్నారు.
  Published by:Sulthana Begum Shaik
  First published: