షాకింగ్... వంశీ వ్యవహారంపై టీడీపీ నేత తీవ్ర వ్యాఖ్యలు

ఏపీలో టీడీపీని కుదిపేస్తున్న ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యవహారంపై ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

news18-telugu
Updated: October 28, 2019, 12:57 PM IST
షాకింగ్... వంశీ వ్యవహారంపై టీడీపీ నేత తీవ్ర వ్యాఖ్యలు
వల్లభనేని వంశీ మోహన్(File)
  • Share this:
ఏపీలో టీడీపీని కుదిపేస్తున్న ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యవహారంపై ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా పార్టీకి రాజీనామా చేయాలి అనుకునే వాళ్లు డైరెక్ట్‌గా చేస్తారని వ్యాఖ్యానించిన బొండా ఉమ... ఫోన్‌ మేసేజ్‌లలో రాజీనామాలు ఏంటో అర్థం కావట్లేదని కామెంట్ చేశారు. ఎమ్మెల్యే పదవి వదులుకోవాలంటే స్పీకర్ ఫార్మాట్‌లో లేఖ పంపాలని బొండా ఉమ అన్నారు. వల్లభనేని వంశీ మెసేజ్‌లు నాలుక గీసుకోవడానికి కూడా పని చేయవు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మూడు రోజుల్లో ముగ్గురు నేతలను వల్లభనేని వంశీ కలిశారని... పార్టీ మారే స్వేచ్ఛ ఎవరికైనా ఉంటుందని బొండా ఉమ అన్నారు.

ఓ వైపు టీడీపీ అధినేత చంద్రబాబు వల్లభనేని వంశీని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తుంటే... బొండా ఉమ ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వంశీని వదులుకోవడానికే టీడీపీ మానసికంగా సిద్ధమైందా ? అనే ప్రచారం కూడా జరుగుతోంది. బొండా ఉమ వ్యాఖ్యలు ఎలా ఉన్నా... వంశీని బుజ్జగించే పనిని విజయవాడ ఎంపీ కేశినేని నాని, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణకు అప్పగించారు చంద్రబాబు. వంశీ చేస్తున్న వాట్సాప్ మేసేజ్‌లకు స్పందిస్తున్న చంద్రబాబు... పార్టీ, ఎమ్మెల్యే పదవిని వీడకుండా ప్రభుత్వం, ప్రజా సమస్యలపై పోరాడాలని ఆయనకు సూచించారు.


First published: October 28, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>