150 పశువులు... వైసీపీపై మండిపడ్డ బొండా ఉమ

ప్రజాఉద్యమంతోనే రాజధానిని సాధిస్తామని తెలిపారు. ప్రధాని శంకుస్థాపన చేసిన రాజధానిని ఇలా చంపేసిన ఏకైక ప్రభుత్వం వైసీపీయేనని బొండా ఉమ అన్నారు.

news18-telugu
Updated: November 27, 2019, 1:59 PM IST
150 పశువులు... వైసీపీపై మండిపడ్డ బొండా ఉమ
సైకిల్ (టీడీపీ గుర్తు)
  • Share this:
ఏపీలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ నేతలపై టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 150 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశువులు రాజధానిని నాశనం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ప్రజా రాజధాని అమరావతిని శ్మశానంతో పోల్చడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని ఆరోపించారు. తమ హయాంలో భవనాలు, హైకోర్టు పూర్తి చేస్తే వైసీపీ ప్రభుత్వం రాజధానిని శ్మశాసనంలా మార్చాలని చూస్తోందని బొండా ఉమ దుయ్యబట్టారు. మంత్రి కొడాలి నాని బూతుల మంత్రి అంటూ ఫైర్ అయిన బోండా ఉమ.. వైసీపీ బూతులకు కూడా ఓ మంత్రిని పెడతారా ? అంటూ ప్రశ్నించారు.

ప్రజాఉద్యమంతోనే రాజధానిని సాధిస్తామని తెలిపారు. ప్రధాని శంకుస్థాపన చేసిన రాజధానిని ఇలా చంపేసిన ఏకైక ప్రభుత్వం వైసీపీయేనని బొండా ఉమ అన్నారు. ప్రజా రాజధానిలో పనులు ఆపేసి.. మంత్రులు నీచ భాష వాడుతున్నారన్నారని బోండా ఉమ పేర్కొన్నారు. ఆనాడు 16,500 కోట్ల లోటు బడ్జెట్‌ ఉన్నా.. చంద్రబాబు తన సమర్దతతో రాజధానిని నిర్మించారని బోండా ఉమ స్పష్టం చేశారు. రాజధాని అంటే ఒక పార్టీదో, ఒక‌ వర్గానిదో కాదని జగన్ గుర్తించాలన్నారు. చట్ట సభలలో కూడా మంత్రులు, స్పీకర్ భాషపై ప్రశ్నిస్తామని బోండా ఉమ స్పష్టం చేశారు.


First published: November 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>