ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్ర ఆరోపణలు చేశారు. తన తండ్రిని ముఖ్యమంత్రిని చేసిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని జగన్ వెన్నుపోటు పొడిచారని... ముఖ్యమంత్రి పీఠం కోసం సొంత బాబాయ్‌ని కడతేర్చారని ట్విట్టర్లో ఆరోపించారు. తాజాగా కరోనాని సైతం ఏపీ సీఎం జగన్ ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారని అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు. కిట్లు, మాస్కులు, చందాలు, ఆఖరికి మద్యం ఇలా అన్ని చోట్లా కోట్లు కొల్లగొడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.
తండ్రి ని ముఖ్యమంత్రి ని చేసిన సోనియా గాంధీని వెన్నుపోటు పొడిచారు.ముఖ్యమంత్రి పీఠం కోసం బాబాయ్ ని కడతేర్చారు.కరోనా ని సైతం ఆదాయ వనరుగా మార్చుకున్నారు.కిట్లు,మాస్కులు,చందాలు,ఆఖరికి మద్యం ఇలా అన్ని చోట్లా కోట్లు కొల్లగొడుతున్నారు.(1/2)
ప్రకృతి ఇప్పటికే కొరడా ఝుళిపించిందని... ఇక దేవుడు కొరడా ఝుళిపించే సమయం ఆసన్నమైందని అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. ఏపీలో మద్యం షాపులు తెరవడంపై టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కరోనా కాలంలో సీఎం జగన్ పేదలను దోచుకుంటున్నారని ఆరోపించారు. మరోవైపు టీడీపీ నేతల విమర్శలకు వైసీపీ కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తోంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.