టీడీపీ నేత ఆత్మహత్యాయత్నం... పోలీస్ స్టేషన్‌పై నుంచి దూకి...

టీడీపీ యువనేత ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడం ఆ పార్టీ వర్గాల్లో కలకలం రేపుతోంది.

news18-telugu
Updated: March 6, 2020, 1:16 PM IST
టీడీపీ నేత ఆత్మహత్యాయత్నం... పోలీస్ స్టేషన్‌పై నుంచి దూకి...
తెలుగుదేశం పార్టీ లోగో
  • Share this:
శ్రీకాకుళం జిల్లాకు చెందిన టీడీపీ యువనేత ఆత్మాహత్యాయత్నానికి ప్రయత్నించడం కలకలం రేపింది. వైసీపీ ప్రభుత్వం తనపై అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ శ్రీకాకుళం జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు చౌదరి బాబ్జీ తనయుడు అవినాష్ ఏకంగా పోలీస్‌స్టేషన్ భవనంపై నుంచి దూకేశాడు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అవినాష్‌కు వేధింపులు ఎక్కువయ్యాయని టీడీపీ ఆరోపిస్తోంది. ప్రతీ గొడవకు అవినాష్‌ను బాధ్యుడిని చేస్తూ ఎచ్చర్ల పోలీసులు కేసులు పెట్టారని ఆ పార్టీ నేతలు విమర్శించారు. ఎస్సై రాజేష్ తనను వేధిస్తున్నారంటూ అవినాష్ తీవ్ర మనస్థాపం చెందాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

గతంలో ఎస్‌ఎంపురం సర్పంచ్‌గా అవినాష్ పనిచేశాడు. అవినాష్ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయనను హుటాహుటిన శ్రీకాకుళం కిమ్స్‌కు తరలించారు. పోలీసులు తీరుపై జిల్లా టీడీపీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం వేధింపుల కారణంగానే అవినాష్ ఆత్మహత్యాయత్నం చేశారని ఆరోపిస్తున్నారు.

First published: March 6, 2020, 1:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading