ఏపీ ప్రభుత్వంపై అస్త్రాన్ని సంధించిన అచ్చెన్నాయుడు..

రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి గురించి పిట్టకథలు చెప్పడం మాని తన 20 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

news18-telugu
Updated: October 12, 2019, 6:47 PM IST
ఏపీ ప్రభుత్వంపై అస్త్రాన్ని సంధించిన అచ్చెన్నాయుడు..
అచ్చెన్నాయుడు (File)
  • Share this:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఓ అస్త్రాన్ని సంధించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి గురించి పిట్టకథలు మాని తన 20 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు 20 ప్రశ్నలతో కూడిన ఓ లేఖను రిలీజ్ చేశారు. దీంతోపాటు వైఎస్ హయాంలో, చంద్రబాబు పాలనలో, జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం ఎంత అప్పుల్లో ఉందనే వివరాలను కూడా పంపారు.

1 రూ.4.84 లకే వచ్చే పవన విద్యుత్‌ కొనకుండా రూ.11.68 పెట్టి ప్రక్క రాష్ట్రం నుండి ఎందుకు కొంటున్నారు? ఇది కమిషన్ల కోసం పవన విద్యుత్‌ సంస్థలను బ్లాక్‌ మెయిల్‌ చేయడం కాదా?

2 మహానది కోల్‌ ఫీల్డ్‌లో రూ.1,600కే ఒక టన్ను బొగ్గు సరఫరాకు ఒప్పందం ఉండగా తెలంగాణా నుండి రూ.3,700లు పెట్టి బొగ్గు ఎందుకు కొంటున్నారు?

3 కేంద్ర ఇంధన శాఖ మంత్రి ఆర్‌ కె సింగ్‌ గారు రాష్ట్రానికి రాసిన లేఖలో రాబోయే 25 ఏళ్లకు కూడా పవన విద్యుత్‌ ధర స్థిరంగా రూ.4.84 కే సరఫరా అవుతుంది. అదే కాలానికి థర్మల్‌ విద్యుత్‌ అయితే యూనిట్‌ రూ. 22 అవుతుందని హెచ్చరించిన విషయం వాస్తవం కాదా? థర్మల్‌ విద్యుత్‌ కన్నా పవన విద్యుత్‌ అన్ని రకాల ఉపయోగకరమని దేశమేకాదు ప్రపంచమే ఘోషిస్తున్న విషయం వాస్తవం కాదా? జగన్‌ ప్రభుత్వం పవన విద్యుత్‌ పై ఎందుకు దుష్ప్రచారం చేస్తోంది?

4 పవర్‌ పర్చేజ్‌ కార్పొరేషన్‌కు రూ.3 వేల కోట్ల రుణం కోసం భారతీయ స్టేట్‌ బ్యాంకుకు వెళ్లారు. దానిపై ఎస్‌బిఐ ఏపీ పవర్‌ పర్చెస్‌ కార్పొరేషన్‌కు రాసిన లేఖలో 4 వ పాయింట్లో గత ప్రభుత్వ ఒప్పందాలను నేటి ప్రభుత్వం అమలు చేయనందున ఇప్పుడు ఇచ్చే లోనుకు గ్యారంటీ ఏమిటో సమాధానం చెప్పాలని ప్రశ్నంచలేదా?

5 ఎస్‌బిఐ లేఖలో 12వ పాయింట్‌నందు పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, బ్యాంకుల మధ్య ద్వైపాక్షిక ఒప్పందమే కాక, ఏపీ ప్రభుత్వం కూడ ఈ ఒప్పందంపై సంతకం చేసి దాన్ని త్రైపాక్షిక ఒప్పందం చేయాలని మిమ్మల్ని కోరలేదా? అధికారానికి వచ్చిన 3 నెలల్లోనే పిపిఏలను తిరగతోడుతున్న నేపథ్యంలో ఇంతకు ముందు దృఢంగా ఉన్న పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ యొక్క పరపతి కుంచించుకుపోయేలా చేశారనేది 12 వ పాయింట్‌ సారాంశంకాదా?

6. తాజాగా క్రిసిల్‌ పవర్‌ పర్చెజ్‌ కార్పొరేషన్‌కు 'డి' గ్రేడ్‌ ఇచ్చిందని ఎస్‌బిఐ తన లేఖలో పేర్కొన్నది వాస్తవం కాదా?7. గత వైఎస్‌, కాంగ్రెస్‌ ప్రభుత్వాలు పెట్టిన విద్యుత్‌ బకాయిలు రూ. 10 వేల కోట్లు చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఉదయ్‌ పథకం కింద తీర్చి డిస్కంలను బలోపేతం చేసింది నిజం కాదా? వైఎస్‌ ప్రభుత్వం విద్యుత్‌ సంస్థలకు పెట్టిన రూ.6 వేల కోట్ల బకాయిలు, ఫీజు రీయంబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.2,400 కోట్లు తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు తీర్చింది వాస్తవం కాదా?

8. 2014లో చంద్రబాబునాయుడు అధికారం చేపట్టే నాటికి 22.5 మిలియన్‌ యూనిట్ల లోటు వారసత్వంగా వచ్చింది. దాన్ని 100 రోజుల్లోనే అధిగమించి కరెంటు కోతలు ఎత్తివేసి 24%|%7 సరఫరా చేసింది వాస్తవం కాదా?

9. 2014లో ఉన్న 9,529 మె.వా విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని చంద్రబాబునాయుడు 2018 నాటికే 19,680 మె.వా.కు పెంచి జగన్‌ చేతిలో పెట్టిన విషయం నిజం కాదా? జగన్‌ అధికారం చేపట్టే నాటికి రాష్ట్రంలో కరెంటు కోతలు లేని స్థితి వాస్తవం కాదా?

10. జగన్‌ అధికారం చేపట్టిన 100 రోజులలోనే కరెంటు కోతలు విధించడం వారి అసమర్థత కాదా? కమిషన్ల కోసం పవన, సౌర విద్యుత్‌ సంస్థలను బ్లాక్‌ మెయిల్‌ చేయడం వల్లే కరెంటు కొరత ఏర్పడిందనేది వాస్తవం కాదా?

11. కడప జిల్లా మైలవరంలో సౌర విద్యుత్‌ పలకలను వైకాపా కార్యకర్తలు ధ్వంసం చేసి కోట్లాది రూపాయల నష్టం చేసింది కమిషన్ల కోసం కాదా? ఇలాగైతే పెట్టుబడులు ఎవరు పెడతారు?

12. కమిషన్ల కోసం మరియు అసమర్థతతో కరెంటు కొరత సృష్టించి మీ దుర్మార్గాన్ని గత ప్రభుత్వంపై నెడితే ప్రజలు నమ్ముతారని భ్రమపడుతున్నారా?

13. 2014 నాటికన్నా 2019 ఏప్రిల్‌ నాటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపరచబడింది వాస్తవం కాదా? 2014లో రాష్ట్ర బడ్జెట్‌ రూ.1,12,000 కోట్లు కాగా, దాన్ని 2019 నాటికి రూ.2,27,000 కోట్లకు పెంచింది వాస్తవం కాదా?

14. ఇతర ప్రభుత్వాల తప్పుల దామాషా కన్నా తక్కువ అప్పు చేసింది చంద్రబాబు ప్రభుత్వమనేది పచ్చి నిజం కాదా? వైఎస్‌ అప్పు చేసి పప్పుకూడు తింటే చంద్రన్న చేసిన అప్పుకన్నా సృష్టించిన ఆస్తులు ఎక్కువకాదా?
15. వైఎస్‌ అప్పు చేసి ఆస్తులు సృష్టించలేదు. 55 వేల కోట్లు జలయజ్ఞంపై పెట్టి ఏదీ పూర్తి చేయక నిరర్థకం చేశారు.

16. చంద్రబాబునాయుడు 60వేల కోట్లు నీటి ప్రాజెక్టులపై ఖర్చు చేసి 32 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతోపాటు అదనపు ఆయకట్టుకు నీటి పారుదల సౌకర్యం కలిగించారు.

17. ఐదు సంవత్సరాలలో ఒక లక్షా 10 వేల కోట్లు అప్పు చేసి అభివృద్ధి, సంక్షేమం ఇతర రాష్ట్రాల అన్నింటికన్నా అధికంగా చేసింది నిజం కాదా? క్రింది వాస్తవాలు బుగ్గనకు తెలియవా?

18. అమరావతి నిర్మాణానికి రూ. 8 వేల కోట్లు ఖర్చు చేయగా ఇందులో కేంద్రం ఇచ్చింది రూ. 1500 కోట్లు.

19. చంద్రన్న రూ.5లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి గ్రౌండ్‌ చేయించారు.

20. వైఎస్‌ హయాంలో14,500 రైతు ఆత్మహత్యలు జరగగా, చంద్రన్న పాలనలో రైతులకు ఆదాయం పెంచడంవలన 1600లకు తగ్గించలిగాం.

PICS: ఆశ్రమంలో పవన్ కళ్యాణ్, ఆకుల్లో భోజనం..

First published: October 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading