Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS

    జగన్‌కు జ్ఞానం ఉందా.. అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం..

    ఏపీలో స్థానిక ఎన్నికల వాయిదాను తప్పుపట్టిన సీఎం జగన్‌పై టీడీపీ ఫైర్ అయ్యింది. స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని వ్యాఖ్యానించింది.

    news18-telugu
    Updated: March 18, 2020, 1:41 PM IST
    జగన్‌కు జ్ఞానం ఉందా.. అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం..
    అచ్చెన్నాయుడు, జగన్
    • Share this:
    ఏపీలో స్థానిక ఎన్నికల వాయిదాను తప్పుపట్టిన సీఎం జగన్‌పై టీడీపీ ఫైర్ అయ్యింది. స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని వ్యాఖ్యానించింది. ఆ పార్టీ నేత అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. సుప్రీం కోర్టును స్వాగతిస్తున్నామని ఆయన అన్నారు. కరోనా విపత్తు వచ్చిన నేపథ్యంలో బాధ్యతతో వ్యవహరించి, ఎన్నికల వాయిదాకు ఓకే చెబుతున్నామని చెప్పారు. సుప్రీం తీర్పుపై ఎన్నికల సంఘం వెంటనే స్పందించాలని ఆయన కోరారు. స్థానిక ఎన్నికల ప్రక్రియను రద్దు చేసి, కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. ఎన్నింటినైనా జగన్ మేనేజ్ చేయగలరని.. కరోనాను మాత్రం మేనేజ్ చేయలేరని ఎద్దేవా చేశారు.

    కరోనా దెబ్బకు ప్రభుత్వమే ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేయాలని కోరాలని, కానీ.. ఇక్కడ ఏపీ ప్రభుత్వం బాధ్యతారాహిత్యంతో కోర్టుకు వెళ్లి దెబ్బ తిన్నదని అన్నారు. జగన్‌కు జ్ఞానం ఉందా? ఈ ప్రభుత్వానికి జ్ఞానం ఉందా? అని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా జగన్ సర్కారు మేల్కొనాలని చెప్పారు.
    Published by: Shravan Kumar Bommakanti
    First published: March 18, 2020, 1:41 PM IST
    మరిన్ని చదవండి
    తదుపరి వార్తలు

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading