చంద్రబాబుకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే షాక్ ఇస్తారా ?

ఎన్నికల్లో ఓటమి తరువాత బొండా ఉమా బీజేపీలోకి వెళతారనే ప్రచారం జరిగింది. అయితే తాను పార్టీ మారబోనని ఆయన గతంలో క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఆయన వైసీపీలోకి వెళ్లొచ్చనే ఊహాగానాలు బెజవాడ పొలిటికల్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

news18-telugu
Updated: August 1, 2019, 1:07 PM IST
చంద్రబాబుకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే షాక్ ఇస్తారా ?
తెలుగుదేశం పార్టీ లోగో
  • Share this:
ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి ఏపీలోని టీడీపీ నేతలు పక్క చూపులు చూస్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన మెజార్టీ రాజ్యసభ సభ్యులు సహా పలువురు నేతలు టీడీపీని వీడి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరతారని గతంలో ఊహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో టీడీపీ నేతల్లో ఎవరు ఎప్పుడు పార్టీ మారతారో తెలియని సంగ్దిగ్ధత నెలకొంది. ఇదిలా ఉంటే విజయవాడకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా పార్టీ మారతారనే ప్రచారం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. టీడీపీ తరపున విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా వ్యవహరించిన బొండా ఉమా... గత ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేతిలో 25 ఓట్ల స్వల్ప మెజార్టీతో ఓటమి పాలయ్యారు.

ఎన్నికల్లో ఓటమి తరువాత బొండా ఉమా బీజేపీలోకి వెళతారనే ప్రచారం జరిగింది. అయితే తాను పార్టీ మారబోనని ఆయన గతంలో క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఆయన వైసీపీలోకి వెళ్లొచ్చనే ఊహాగానాలు బెజవాడ పొలిటికల్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి. బొండా ఉమా పార్టీలోకి వస్తే విజయవాడ తూర్పు నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ బాధ్యతలు ఇవ్వడానికి వైసీపీ సముఖంగా ఉందని... ఇందుకు సంబంధించి ఇప్పటికే ఆ పార్టీ నేతలు బొండా ఉమాను సంప్రదించారని ప్రచారం జరుగుతోంది.

Bonda uma will join ysrcp,Vijayawada central ex mla bonda uma,chandrababu shock to bonda uma,bonda uma bungi jump,bonda uma,tdp mla bonda uma,mla bonda uma,bonda uma speech,ysrcp,bonda umamaheswara rao,bonda uma vs roja,bonda uma ysrcp,bonda uma joins ysrcp,ysrcp mla roja,vijayawada mla bonda uma,bonda uma slams ysrcp roja |,bonda uma comments on ysrcp,bonda uma to join ysrcp?,bonda uma vs roja tdp vs ysrcp,bonda uma fires on ysrcp mlas,tdp mla bonda uma fires on ysrcp,వైసీపీలోకి బొండా ఉమా,విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా,చంద్రబాబుకు బొండా ఉమా షాక్,టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా
విదేశాల్లో బంగీ జంప్ చేస్తూ సేద తీరుతున్న బొండా ఉమా


అయితే బొండా ఉమా మాత్రం తనకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కావాలని కోరుతున్నారని తెలుస్తోంది. విజయవాడ నగరంలో తమ పార్టీ తరపున కాపు సామాజికవర్గానికి చెందిన బలమైన నేత లేకపోవడం వల్లే... వైసీపీ బొండా ఉమాతో చర్చలు జరుపుతున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న బొండా ఉమా నగరానికి తిరిగి వచ్చిన తరువాత దీనిపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మొత్తానికి విదేశాల్లో బంగీ చేస్తూ రిలీఫ్ అవుతున్న బొండా ఉమా... త్వరలోనే వేరే పార్టీలోకి జంప్ చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.
First published: August 1, 2019, 12:59 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading