అందుకే జగన్‌కు తెలుగుపై కోపం... మండిపడ్డ సీనియర్ నటి

పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు మద్దతిస్తే ఆయనను దత్తపుత్రుడు అని విమర్శిస్తున్నారని... సీఎం జగన్ పక్కా రాష్ట్రానికి దాసోహపుత్రుడు కాదా ? అని దివ్యవాణి ఫైర్ అయ్యారు.

news18-telugu
Updated: November 14, 2019, 4:02 PM IST
అందుకే జగన్‌కు తెలుగుపై కోపం... మండిపడ్డ సీనియర్ నటి
దివ్యవాణి, జగన్
  • Share this:
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై సీనియర్ నటి, టీడీపీ నాయకురాలు దివ్యవాణి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు ఇసుక దీక్ష కార్యక్రమంలో మాట్లాడిన దివ్యవాణి... వైసీపీ ప్రజాసమస్యలపై మాట్లాడకుండా ఇతర అంశాలపై మాట్లాడి సమస్యను తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం సర్కార్ పాఠశాల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం వెనుక అసలు కారణం వేరే ఉందని ఆమె ఆరోపించారు. తెలుగుదేశంలో తెలుగు ఉందని... అందుకే తెలుగు భాషను లేకుండా చేయాలని సీఎం జగన్ చూస్తున్నారని దివ్యవాణి విమర్శించారు. ఇంగ్లీష్ భాష ముఖ్యమే అని... అయితే అది తెలుగును డామినేట్ చేసే విధంగా ఉండకూడదని ఆమె సూచించారు.

పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు మద్దతిస్తే ఆయనను దత్తపుత్రుడు అని విమర్శిస్తున్నారని... సీఎం జగన్ పక్కా రాష్ట్రానికి దాసోహపుత్రుడు కాదా ? అని దివ్యవాణి ఫైర్ అయ్యారు. ప్రజలందరూ మళ్లీ చంద్రబాబు రావాలని కోరుకుంటున్నారని ఆమె అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇసుక కొరత తీర్చి కార్మికులకు ఇబ్బంది లేకుండా చేయాలని అన్నారు.

Published by: Kishore Akkaladevi
First published: November 14, 2019, 4:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading