పవన్ కళ్యాణ్‌కు మాజీమంత్రి సపోర్ట్... ఆ నేతకు కౌంటర్

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)

పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లో నటించడం తప్పుకాదని టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి అభిప్రాయపడ్డారు.

  • Share this:
    జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ మళ్లీ సినిమాల్లో నటించడంలో ఎలాంటి తప్పు లేదని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఎన్టీఆర్, ఎంజీఆర్ లాంటి వాళ్లే రాజకీయాల్లోకి వచ్చాక కూడా సినిమాల్లో నటించారని ఆయన పేర్కొన్నారు. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ ఒకటి రెండు సినిమాల్లో నటిస్తే రాష్ట్రానికి వచ్చిన నష్టమేమీ లేదంటూ సోమిరెడ్డి తన ట్వీట్‌లో ప్రస్తావించారు. రాజకీయ నాయకులు సినిమాల్లో నటిస్తేనే ప్రజాస్వామ్యానికి ప్రమాదమని ఆయన వ్యాఖ్యానించారు. జనసేనకు రాజీనామా చేస్తూ... పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లో నటించడం తనకు నచ్చలేదని లక్ష్మీనారాయణ లేఖ రాసిన సంగతి తెలిసిందే.    లక్ష్మీనారాయణ రాజీనామాపై స్పందించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్...ఆయనపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు. తన కోసం, తరపై ఆధారపడిన కుటుంబాల కోసమే సినిమాలు చేస్తున్నానని తెలిపారు. పార్టీ ఆర్థిక పుష్టి కోసం సినిమాలు చేయడం తప్పనిసరని వెల్లడించారు. సిమెంట్ ఫ్యాక్టరీలు, పాల ఫ్యాక్టరీలు, అధిక వేతనం వచ్చే ప్రభుత్వ ఉద్యోగం లేదని.. తనకు సినిమాలు తప్పా ఇంకేం తెలియవని స్పష్టం చేశారు.
    Published by:Kishore Akkaladevi
    First published: