Home /News /politics /

TDP LEADER AND EX MINISTER ATCHANNAIDU REACTION ON AP ESI SCAM AK

AP ESI SCAM: ప్రధాని చెప్పినట్టే... తెలంగాణలో చేసినట్టే... ఈఎస్‌ఐ స్కాంపై స్పందించిన మాజీమంత్రి

అచ్చెన్నాయుడు (ఫైల్ ఫోటో)

అచ్చెన్నాయుడు (ఫైల్ ఫోటో)

AP ESI SCAM: ఏపీలో వెలుగు చూసిన ఈఎస్ఐ కుంభకోణం వ్యవహారంపై మాజీమంత్రి, టీడీపీ సీనియర్ అచ్చెన్నాయుడు స్పందించారు

  ఏపీలో వెలుగు చూసిన ఈఎస్ఐ కుంభకోణం వ్యవహారంపై మాజీమంత్రి, టీడీపీ సీనియర్ అచ్చెన్నాయుడు స్పందించారు. అప్పట్లో ప్రధాని నరేంద్రమోదీ ఆదేశించిన విధంగానే తాము వ్యవహరించామని ఆయన స్పష్టం చేశారు. టెలీ హెల్త్ సర్వీసులకు అర్డర్స్ ఇచ్చే విషయంలో తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించిన విధంగానే తాము కూడా వ్యవహరించామని అచ్చెన్నాయుడు తెలిపారు. తాను మంత్రిగా ఇచ్చిన లేఖలోనూ ఇదే విషయం ఉందని ఆయన గుర్తు చేశారు. తాను ఎప్పుడూ అవినీతికి పాల్పడలేదని ఆయన వ్యాఖ్యానించారు. తనకు డబ్బులు అవసరమైతే తెలిసిన వాళ్ల దగ్గర డబ్బులు తీసుకుంటానని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై ప్రభుత్వం విచారణ చేసుకోవచ్చని సూచించారు. తనపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

  అంతకుముందు ఏపీ ఈఎస్ఐలో చోటు చేసుకున్న భారీ కుంభకోణాన్ని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బయటపెట్టింది. ఈ కుంభకోణంలో టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి అచ్చెన్నాయుడు పాత్ర ఉందని రిపోర్ట్‌లో పేర్కొన్నారు. నామినేషన్ పద్ధతిలో అచ్చెన్నాయుడు టెండర్లు ఇప్పించారని రిపోర్ట్‌లో ప్రస్తావించారు. టెలీ హెల్త్ సర్వీసుల పేరుతో ఆర్డర్స్ ఇవ్వడంలో అచ్చెన్నాయుడు ఒత్తిడి తెచ్చారని... నామినేషన్ల పద్ధతిలో కేటాయించాలని అచ్చెన్నాయుడు ఆదేశించారని రిపోర్ట్‌ ద్వారా వెలుగులోకి వచ్చింది.

  ఈఎస్‌ఐలో గత ఆరేళ్లలో కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని తేలింది. లేని కంపెనీల నుంచి నకిలీ కొటేషన్లు తీసుకుని ఆర్డర్లు ఇచ్చినట్టు అధికారులు గుర్తించారు. రేట్ కాంట్రాక్ట్‌లో లేని కంపెనీలకు ఈఎస్ఐ డైరెక్టర్లు రూ. 51 కోట్ల చెల్లించిన తేలింది. ఈ మొత్తం వ్యవహారానికి ఈఎస్ఐ డైరెక్టర్లు రవికుమార్, రమేశ్, విజయ్‌ను బాధ్యులుగా గుర్తించారు. మందులు, పరికరాలను వాస్తవ ధరకంటే...136 శాతం అధికారంగా సంస్థలు టెండర్లలో చూపించాయి. లెజెండ్ ఎంటర్ ప్రైజెస్, ఓమ్మిమేడి ఎన్వెంటర్ ఫెర్ఫామెన్స్ సంస్థలకు డైరెక్టర్లు అక్రమంగా రూ. 85 కోట్లు చెల్లించినట్టు రిపోర్టులో ప్రస్తావించారు. స్కామ్‌లో ఈఎస్ఐ డైరెక్టర్లకు ఆరుగురు జాయింట్ డైరెక్టర్లు సహకరించారని పేర్కొన్నారు.
  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Andhra Pradesh, Esi scam, Kinjarapu Atchannaidu

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు