'తిరుపతిని రాజధాని చేయాలి.. లేదంటే పక్క రాష్ట్రంలో కలుస్తాం'..

మాజీ మంత్రి అమర్‌నాథ్ రెడ్డి సరికొత్త డిమాండ్‌ తీసుకొచ్చారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని.. అధి సాధ్యంకాని పక్షంలో టెంపుల్ సిటీ తిరుపతిని రాజధాని చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

news18-telugu
Updated: January 3, 2020, 3:41 PM IST
'తిరుపతిని రాజధాని చేయాలి.. లేదంటే పక్క రాష్ట్రంలో కలుస్తాం'..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏపీలో మూడు రాజధానుల అంశంపై తీవ్ర దుమారం రేగుతోంది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని విపక్ష నేతలు, రాజధాని రైతులు ఆందోళన చేస్తున్నారు. 15 రోజులుగా అమరావతి రోడ్లపై నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలో రోజు కొత్త డిమాండ్ తెరపైకి వస్తోంది. కర్నూలును రాజధాని చేయాలని.. రాయలసీమ నేతలు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి అమర్‌నాథ్ రెడ్డి సరికొత్త డిమాండ్‌ తీసుకొచ్చారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని.. అధి సాధ్యంకాని పక్షంలో టెంపుల్ సిటీ తిరుపతిని రాజధాని చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే చిత్తూరు జిల్లాను కర్నాటక లేదా తమిళనాడులో కలపాలని స్పష్టం చేశారు.

ఏపీ రాజధానిగా అమరావతిని చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించినప్పుడు జగన్ ఏం చేశారని అమర్ నాథ్ రెడ్డి విరుచుకుపడ్డారు. అప్పుడే అమరావతిని ఎందుకు వ్యతిరేకించలేదని.. మూడు రాజధానుల కాన్సెప్ట్‌ని ఎందుకు చెప్పలేదని విమర్శలు గుప్పించారు. రాజధానికి తిరుపతి అనువైన ప్రాంతమని.. తిరుపతిని ఏపీ రాజధాని చేయకుంటే మరో ఉద్యమం తప్పదని స్పష్టం చేశారు అమర్‌నాథ్ రెడ్డి. ఒకవేళ ఏపీకి మూడు రాజధానులను పెడితే.. అప్పుడు ముగ్గురు ముఖ్యమంత్రులు కూడా నియమించాలని ఆయన డిమాండ్ చేశారు.
మాజీ మంత్రి అమర్‌నాథ్ రెడ్డి


First published: January 3, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు