ఐటీకి డెఫినేషన్ చెప్పింది చంద్రబాబు.. కేసీఆర్‌వి బట్టేబాజ్ మాటలు: బాలకృష్ణ

telangana assembley elections 2018|తెలంగాణ ఎన్నికల్లో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ. కూకట్‌పల్లిలో కూటమి అభ్యర్థి సుహాసిని తరపున ప్రచారం నిర్వహించిన ఆయన.. టీఆర్ఎస్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు.

news18-telugu
Updated: December 4, 2018, 1:44 PM IST
ఐటీకి డెఫినేషన్ చెప్పింది చంద్రబాబు.. కేసీఆర్‌వి బట్టేబాజ్ మాటలు: బాలకృష్ణ
రోడ్ షోలో బాలకృష్ణ(File)
  • Share this:
తెలంగాణలో ప్రజావ్యతిరేక పాలన నడుస్తోందని హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని కేసీఆర్ ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు. ఏ వర్గమూ ఆనందంగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కూకట్‌పల్లిలో ప్రజాకూటమి అభ్యర్థి నందమూరి సుహాసినికి మద్దతుగా రోడ్‌షో నిర్వహించిన బాలకృష్ణ.. హైదరాబాద్‌ను ప్రపంచస్థాయిలో అభివృద్ధి చేసింది చంద్రబాబేనన్నారు. రాష్ట్రవిభజన తర్వాత అధికారం చేజిక్కించుకున్న కేసీఆర్.. నగరంలో చేసిన అభివృద్ధేమీ లేదన్నారు. హైటెక్ సిటీ నుంచి ఔటర్ రింగ్‌రోడ్డు వరకు అన్నీ చంద్రబాబు హయాంలోనే వచ్చాయని గుర్తు చేశారు. ఐటీకి స్పెల్లింగ్ తెలియని రోజుల్లో... ఐటీకి డెఫినేషన్ చెప్పిన చంద్రబాబుపై.. టీఆర్ఎస్ నేతలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పి.. ప్రజాకూటమిని భారీ మెజార్టీ గెలిపించాలని పిలుపునిచ్చారు.

ముస్లింలను కేసీఆర్ కల్లబొల్లి మాటలతో మోసం చేస్తున్నారని బాలకృష్ణ విమర్శించారు. అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లో 12శాతం రిజర్వేషన్లు సాధిస్తామంటూ బట్టేబాజ్ మాటలు చెప్పిన కేసీఆర్.. ఆ తర్వాత అన్నీ మర్చిపోయారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రైతులను ఇబ్బందులకు గురిచేస్తూ.. రాబందుల రాజ్యాన్ని తీసుకొచ్చారని విమర్శించారు. తెలంగాణలో టీడీపీని తుడిచిపెట్టేయడం ఎవరి వల్లా కాదని, పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తామని చెప్పారు.
Published by: Santhosh Kumar Pyata
First published: December 4, 2018, 1:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading