హోమ్ /వార్తలు /రాజకీయం /

టీడీపీ, కాంగ్రెస్, జనసేన కలయికలో ‘మహాకూటమి’... బీజేపీ, వైసీపీ అంచనా

టీడీపీ, కాంగ్రెస్, జనసేన కలయికలో ‘మహాకూటమి’... బీజేపీ, వైసీపీ అంచనా

రాహుల్ గాంధీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్

రాహుల్ గాంధీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్

ఏపీలో టీడీపీ సారథ్యంలో మరోసారి మహాకూటమి ఏర్పాటవుతుందని... అందులో టీడీపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీలు భాగస్వాములుగా ఉంటాయని ప్రధాని నరేంద్రమోదీతో పాటు వైసీపీ కచ్చితమైన అంచనాతో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

    ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి మహాకూటమి ఏర్పాడబోతోందా ? 2014 తరహాలోనే ఏపీలో మూడు రాజకీయపార్టీలు కలిసి పోటీ చేస్తాయా ? చంద్రబాబు మాటలకు అర్థం ఏంటి ? ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉంది. ఏపీలో టీడీపీ, వైసీపీ, జనసేన ఎన్నికల బరిలో దిగడం దాదాపు ఖాయం కావడంతో... వీరిలో ఏ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయనే దానిపై చాలా రోజుల నుంచి చర్చ జరుగుతోంది. అయితే వీరంతా ఎవరికి వాళ్లు... తాము సొంతంగా పోటీ చేస్తామని ప్రకటించుకున్నారు. అయితే జనసేనతో తమతో కలిస్తే జగన్‌కు ఇబ్బందేమిటని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ప్రకటనతో ఒక్కసారిగా రాజకీయవర్గాల్లో సరికొత్త ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే ఏపీలో టీడీపీ సారథ్యంలో మరోసారి మహాకూటమి ఏర్పాటవుతుందని... అందులో టీడీపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీలు భాగస్వాములుగా ఉంటాయని ప్రధాని నరేంద్రమోదీతో పాటు ఏపీలో ప్రధాన ప్రతిపక్షం వైసీపీ కచ్చితమైన అంచనాతో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.


    గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి ఎన్నికల బరిలో దిగాయి. జనసేన ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేయకపోయినా... పవన్ కళ్యాణ్ మాత్రం టీడీపీ, బీజేపీ కూటమి విజయం కోసం విస్తృతంగా ప్రచారం చేపట్టారు. అయితే కొద్ది రోజుల క్రితం టీడీపీతో విభేధించిన పవన్ కళ్యాణ్... వచ్చే ఎన్నికల్లో సొంతంగా బరిలోకి దిగడానికి నిర్ణయించుకున్నారని వార్తలు వినిపించాయి. కానీ... చంద్రబాబు తాజా వ్యాఖ్యలతో ఆయన సారథ్యంలోని జనసేన మరోసారి టీడీపీతో కలిసి పోటీ చేస్తుందనే ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.


    ప్రస్తుతం జాతీయ రాజకీయాలతో పాటు ఏపీ రాజకీయాల్లోనూ టీడీపీ, కాంగ్రెస్ మిత్రులుగా ఉన్నాయి. ఈ రెండు పార్టీలు వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేసే అవకాశం ఉంది. ఒకవేళ పవన్ కళ్యాణ్, టీడీపీతో కలిసి పోటీ చేయాలని భావిస్తే... అప్పుడు టీడీపీ, జనసేన, కాంగ్రెస్ కలిసి కూటమిగా ఏర్పడే అవకాశం ఉంటుంది. అంటే ఏపీ రాజకీయాల్లో ఒక రకమైన మహాకూటమి ఏర్పడటం ఖాయం. అదే జరిగితే ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలోకి కొత్తగా కాంగ్రెస్ వచ్చి బీజేపీ బయటకు వెళ్లిపోయినట్టు అవుతుంది. అయితే ఇది నిజంగా వర్కవుట్ అవుతుందా ? ఇందుకు జనసేన అంగీకరిస్తుందా ? అనే అంశంపైనే ఈ కూటమి ఏర్పాటు ఆధారపడి ఉంటుంది.

    First published:

    Tags: Andhra Pradesh, Bjp, Congress, Janasena, Mahakutami, Tdp, Ysrcp

    ఉత్తమ కథలు