జగన్ రాజకీయ చాణక్యం... ఒక్క దెబ్బకు మూడు పిట్టలు..

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి యువకుడే కానీ, రాజకీయాల్లో మాత్రం ఆరితేరిన అడుగులు వేస్తున్నారు.

news18-telugu
Updated: September 1, 2019, 6:00 PM IST
జగన్ రాజకీయ చాణక్యం... ఒక్క దెబ్బకు మూడు పిట్టలు..
ఏపీ సీఎం వైఎస్ జగన్
  • Share this:
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి యువకుడే కానీ, రాజకీయాల్లో మాత్రం ఆరితేరిన అడుగులు వేస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేతలకు కూడా మింగుడుపడని వ్యూహాలు అమలు చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలను గమనించిన విశ్లేషకులు ఈ అభిప్రాయానికి వస్తున్నారు. ఇటీవల అమరావతి మీద బొత్స చేసిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్రంలో పెనుదుమారాన్ని సృష్టించాయి. రాజధాని తరలిపోతుందనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. అయితే, దీనిపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారికంగా ఇప్పటి వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అయితే, ఆ దుమారం మాత్రం ఇతర పార్టీల్లో ప్రకంపనలను సృష్టించింది.

Difference in ap bjp, kanna Lakshminarayana, sudeesh rambotla, Amaravati, ap bjp leaders angry on kanna, amit shah, tdp, bjp, ysrcp, ap news, ap politics, ఏపీ బీజేపీలో విభేదాలు, కన్నా లక్ష్మీనారాయణ, సుధీష్ రాంభొట్ల, కన్నాపై ఏపీ బీజేపీ నేతల ఆగ్రహం, అమిత్ షా
ప్రతీకాత్మక చిత్రం


బీజేపీ విషయాన్నే తీసుకుంటే.. అమరావతి మీద బీజేపీలోని పెద్దలు ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థంకాక డోలాయమానంలో పడిపోయారు. దానికి కారణం.. విజయసాయిరెడ్డి. తాము ఏం చేసినా మోదీ, అమిత్ షా ఆశీస్సులు ఉన్నాయని విజయసాయిరెడ్డి చెప్పడంతో కేంద్రంలో పెద్దలు ఓకే చెప్పిన అంశానికి తాము అడ్డుతగిలితే మొదటికే మోసం వస్తుందేమో అనే డౌట్ రాష్ట్ర బీజేపీ నేతల్లో వచ్చేసింది. దీంతో కొందరు వైసీపీ అభిప్రాయానికి మొగ్గుచూపితే, మరికొందరు దాన్ని వ్యతిరేకించారు. దీంతో బీజేపీలో రెండు వర్గాలు ఏర్పడ్డాయి. తన మైండ్ గేమ్‌తో బీజేపీలో చిచ్చు రాజేశారు సీఎం జగన్.

Ttd budget cut for Amaravati temple, Sri venkateshwara temple in Amaravati, budget cut for Amaravati Sri venkateshwara temple, 30 crores budget for Amaravati temple, ap cm ys jagan, chandrababu naidu, ttd, yv subba reddy, tdp, ysrcp, ap news, అమరావతి శ్రీవారి ఆలయానికి బడ్జెట్ కోత, అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణం, శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం, అమరావతి ఆలయానికి రూ. 30 కోట్లు, ఏపీ సీఎం జగన్, చంద్రబాబు, టీటీడీ, వైవీ సుబ్బారెడ్డి, టీడీపీ, వైసీపీ, ఏపీ న్యూస్
అమరావతి శ్రీవారి ఆలయం ప్లాన్‌ను పరిశీలిస్తున్న నాటి సీఎం చంద్రబాబు(ఫేస్ బుక్ ఇమేజ్)


ఇక టీడీపీకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అమరావతి వెనుక పెద్ద స్కాం ఉందని, చంద్రబాబు తన అనుయాయులకు వందలాది ఎకరాలు కట్టబెట్టి, ఇన్ సైడర్ ట్రేడింగ్ ద్వారా ముందే కొనుగోలు చేసి.. ఆ తర్వాత రాజధానిని ప్రకటించారంటూ బొత్స ససాక్ష్యాలతో సహా ప్రకటించారు. బాలకృష్ణ రెండో అల్లుడు శ్రీభరత్‌కు సంబంధించిన కొన్ని ఆధారాలను బయటపెట్టడం ద్వారా టీడీపీని డిఫెన్స్‌లో పడేశారు.

mangalagiri janasena office, janasena chief pawan kalyan, mangalagiri, snake in janasena office, pawan kalyan tour, amaravati tour, ap capital, ap news, ap politics, telugu news, andhra pradesh, జనసేన పార్టీలో పాము, పవన్ కల్యాన్, మంగళగిరి, అమరావతి, జనసేన పార్టీ కార్యాలయం, ఏపీ రాజధానిలో పవన్ పర్యటన, ఏపీ రాజధాని, అమరావతి,
అమరావతి రైతులతో పవన్ కల్యాణ్


మరోవైపు పవన్ కళ్యాణ్‌ ముందరి కాళ్లకు బంధం వేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి. టీడీపీ హయాంలో అమరావతి మీద పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఫోకస్ చేయడం ద్వారా జనసేనాని డిఫెన్స్‌లో పడేస్తున్నారు. అమరావతి మీద పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తే.. టీడీపీకి ఏజెంట్ అనే ముద్రను మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఆ రకంగా ఒక్కదెబ్బతో అటు బీజేపీ, ఇటు టీడీపీ - జనసేనలను కూడా ఇరుకునపెడుతున్నారు.
First published: September 1, 2019, 5:52 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading