తెలంగాణలో కాంగ్రెస్, ఏపీలో టీడీపీ.. బీజేపీ టార్గెట్ ఇదేనా?

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కమలం పార్టీ.. తెలుగు రాష్ట్రాల మీద కన్నేసింది. వీలైనన్ని ఎంపీ స్థానాలు గెలిచేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తోంది. అయితే, అందుకు అనుకూలమైన పరిస్థితులు లేకపోవడంతో ఎన్నికల బరిలో దూసుకెళ్లేందుకు ప్రధానంగా బీజేపీ రెండు లక్ష్యాలను నిర్దేశించుకున్నట్టు తెలుస్తోంది.

news18-telugu
Updated: February 12, 2019, 4:53 PM IST
తెలంగాణలో కాంగ్రెస్, ఏపీలో టీడీపీ.. బీజేపీ టార్గెట్ ఇదేనా?
మోదీ, రాహుల్, చంద్రబాబు ఫైల్
news18-telugu
Updated: February 12, 2019, 4:53 PM IST
తెలుగు రాష్ట్రాల్లో సత్తా చాటేందుకు వ్యూహాలు రచిస్తోంది భారతీయ జనతా పార్టీ. గత పార్లమెంటు ఎన్నికల్లో ఏపీ నుంచి 2, తెలంగాణ నుంచి ఒక స్థానం నుంచి గెలుపొందిన బీజేపీ.. ఈ సారి గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొనేలా కనిపిస్తోంది. నాలుగున్నరేళ్లుగా రామ్ మాధవ్, మురళీధర్‌రావు వంటి నేతలను పురమాయించినా... పార్టీ వృద్ధిలో ఎలాంటి పురోగతీ కనిపించలేదు. తాజాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఎదురైన ఘోర పరాభవమే ఇందుకు ఉదారణగా చెప్పొచ్చు. గత ఎన్నికల్లో 5 అసెంబ్లీ స్థానాలు గెలిచిన బీజేపీ.. ఈసారి తెలంగాణలో ఒక్క స్థానానికే పరిమితమైంది. అటు ఏపీలోనూ అలాంటి పరిస్థితులే ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెండు వ్యూహాలను అమలు చేయాలని భావిస్తోంది బీజేపీ అగ్రనాయకత్వం. ఒకటి ప్రత్యర్థులను ఎదుర్కొని విజయం సాధించడం, రెండోది ప్రత్యర్థులను బలహీన పరిచి అనుకూల పార్టీలను విజయం వరించేలా చేయడం.

modi guntur schedule details : PM Visit Rises Political Heat in Andhra Pradesh
ప్రధాని నరేంద్రమోదీ(File)


అయితే, బీజేపీ మొదటి ప్లాన్ వర్కవుట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఏపీలో టీడీపీ, వైసీపీ బలంగా ఉన్నాయి. కాంగ్రెస్, ఉన్నా లేనట్టుగానే ఉంది. అందుకే, గతంలో మిత్రపక్షంగా ఉండి ఇప్పుడు ప్రత్యర్థిగా మారిన టీడీపీనే ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తోంది బీజేపీ. అలా టీడీపీని దెబ్బకొట్టి, వైసీపీకి లాభం చేకూర్చాలన్నది బీజేపీ ఆలోచనగా తెలుస్తోంది. దీనివల్ల పరోక్షంగా కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టి కేంద్రంలో తమకు పోటీ లేకుండా చేసుకోవాలని చూస్తోంది.

bjp tdp, bjp amitshah, pm narendra modi, tdp chandrababu naidu, trs telangana, ap congress , telangana congress, bjp in ap, bjp in telangana, తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, ఏపీ కాంగ్రెస్, తెలంగాణ కాంగ్రెస్, ఏపీలో బీజేపీ, తెలంగాణలో బీజేపీ, బీజేపీ టీడీపీ, వైఎస్ఆర్‌సీపీ, బీజేపీ అమిత్‌షా, ప్రధాని నరేంద్ర మోదీ
cbn,modhi, kcr file
ఇక, తెలంగాణలో ఎలాగో సత్తాచూపలేమనే విషయం తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో బీజేపీ నేతలకు తెలిసి వచ్చింది. తాజా అసెంబ్లీ ఎన్నికల గెలుపుతో అక్కడ టీఆర్ఎస్ పార్టీ జోష్‌లో ఉంది. అయితే, కాంగ్రెస్ పార్టీ కూడా గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధంగానే ఉంది. అందుకే ఇక్కడ కాంగ్రెస్‌ను టార్గెట్ చేయడం ద్వారా టీఆర్ఎస్‌కు మేలు చేకూర్చాలన్నది బీజేపీ అగ్రనేతల ఆలోచనగా కనిపిస్తోంది. దీంతో కాంగ్రెస్ అకౌంట్‌ నుంచి మరిన్ని ఎంపీ స్థానాలను దూరం చేసినట్టవుతుందన్నది బీజేపీ స్కెచ్‌గా తెలుస్తోంది. మొత్తం 17 స్థానాల్లో ఒక స్థానం ఎంఐఎం గెలిచినా, మిగితా 16 స్థానాల్లో జయకేతనం ఎగరేస్తామని ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ నేతలు ఘంటాపథంగా చెబుతున్నారు.

Andhra Pradesh, AP BJP, pm modi, amit shah, chandrababu, tdp, ఆంధ్రప్రదేశ్, ఏపీ బీజేపీ, ప్రధాని మోదీ, అమిత్ షా, చంద్రబాబు, టీడీపీ
ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా(ఫైల్ ఫోటో)


తాను గెలవకపోయినా ఫర్వాలేదు, ప్రధాన శత్రువును బలహీన పర్చి అనుకూలపక్షాన్ని గెలిపించుకోవాలన్న ఆలోచనతో బీజేపీ ఉన్నట్టు తెలుస్తోంది. బీజేపీ ప్రధాన శత్రువు కాంగ్రెస్ కాబట్టి తెలంగాణలో ఆ పార్టీని దెబ్బకొట్టేందుకు ప్లాన్ చేస్తోంది. ఏపీలో ఆ పార్టీ అంత బలంగా లేదుకాబట్టి.. దానికి జాతీయ స్థాయిలో మద్దతు తెలుపుతున్న టీడీపీని ప్రధానశత్రువుగా భావిస్తోంది. అందుకే ఏపీలో చంద్రబాబును టార్గెట్ చేసింది. మరి, బీజేపీ ప్లాన్ వర్కవుట్ అవుతుందా లేదా అనేది చూడాలి.

 

 
First published: February 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...