వైఎస్ జగన్ పాలనకు టీడీపీ ప్రోగ్రెస్ కార్డ్.. ఎన్ని మార్కులంటే..

జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆరు నెలల పాలన పూర్తి చేసకున్నారు. జగన్ పాలనకు టీడీపీ మార్కులు వేసింది.

news18-telugu
Updated: November 30, 2019, 7:49 PM IST
వైఎస్ జగన్ పాలనకు టీడీపీ ప్రోగ్రెస్ కార్డ్.. ఎన్ని మార్కులంటే..
చంద్రబాబు, జగన్
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి ఆరు నెలలు పూర్తయింది. మే 30న ఆయన నవ్యాంధ్ర రెండో సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. ఆరు నెలల్ల తాను దేశంలోనే బెస్ట్ సీఎం అనిపించుకుంటానని, ఆ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. అయితే, ఈ ఆరు నెలల కాలంలో జగన్ మోహన్ రెడ్డి పనితీరుకు టీడీపీ మార్కులు వేసింది. ‘6 నెలల్లో మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటానన్న సీఎం జగన్ గారి ప్రోగ్రెస్ కార్డు ఎలా ఉందో చూద్దాం. ఈ 6 నెలల్లో జగన్ గారు ఏపీ బ్రాండ్ ఇమేజీని ఏమైనా పెంచారా? అబ్బే పెంచడం సంగతి తర్వాత బాగా డామేజ్ చేసినందుకు నెగిటివ్ మార్కులివ్వాలి. కానీ జీరోతో సరిపెడదాం.’ అని టీడీపీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేసింది.

Published by: Ashok Kumar Bonepalli
First published: November 30, 2019, 7:41 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading