ఇద్దరు ఎమ్మెల్సీలకు షాక్ ఇవ్వనున్న టీడీపీ

రూల్ 71 నోటీసుపై చర్చ సందర్భంగా టీడీపీకి చెందిన ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాథ్ రెడ్డి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారు.

news18-telugu
Updated: January 22, 2020, 11:57 AM IST
ఇద్దరు ఎమ్మెల్సీలకు షాక్ ఇవ్వనున్న టీడీపీ
తెలుగుదేశం పార్టీ లోగో
  • Share this:
నిన్న శాసనమండలిలో చర్చ సందర్భంగా ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేసిన తమ పార్టీ ఎమ్మెల్సీలకు షాక్ ఇచ్చేందుకు టీడీపీ సిద్ధమవుతోంది. రూల్ 71 నోటీసుపై చర్చ సందర్భంగా టీడీపీకి చెందిన ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాథ్ రెడ్డి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారు. దీంతో వీరిపై చర్యలు తీసుకునేందుకు టీడీపీ సిద్ధమవుతోంది. ఈ ఇద్దరిపై అనర్హత వేటు వేయాలని మండలి చైర్మన్‌కు టీడీపీ నోటీసులు ఇచ్చింది. వీటితో పాటు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని టీడీపీ ఎమ్మెల్సీలు నోటీసులు జారీ చేశారు. బిల్లులకు వివిధ సవరణలు సూచిస్తూ మరో నోటీసు కూడా మండలి చైర్మన్‌కు అందజేశారు.
First published: January 22, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు