ఫోర్జరీ సంతకాలతో పేదలకు ఇళ్లపట్టాలు... టీడీపీ ఎమ్మెల్యేపై కేసు..

కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మీద బాపులపాడు తహసీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

news18-telugu
Updated: October 19, 2019, 7:35 PM IST
ఫోర్జరీ సంతకాలతో పేదలకు ఇళ్లపట్టాలు... టీడీపీ ఎమ్మెల్యేపై కేసు..
తెలుగుదేశం పార్టీ లోగో
  • Share this:
ఏపీలో మరో టీడీపీ ఎమ్మెల్యే మీద కేసు నమోదైంది. కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మీద బాపులపాడు తహసీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన వల్లభనేని వంశీ... వేల సంఖ్యలో నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారంటూ హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎన్నికలకు ముందు తన స్థానంలో పనిచేసిన తహసీల్దార్ సంతకాన్ని వల్లభనేని వంశీ సంతకాన్ని ఫోర్జరీ చేశారని.. పేదలకు నకిలీ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారంటూ కొత్త తహసీల్దార్ పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పెరికీడు, కొయ్యూరు, కోడూరుపాడు, బాపులపాడు సహా పలు గ్రామాల్లో నకిలీ ఇళ్లపట్టాలను పంపిణీ చేశారని తహసీల్దార్ ఆరోపించారు. దీంతో పోలీసులు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీతోపాటు ఆయన అనుచరుడు రంగాపై కేసు నమోదు చేశారు.
First published: October 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading