TDP FORMS A PROTECTION CELL FOR ITS CADRE FROM YSRCP SAYS NARA LOKESH BA
వైసీపీ దాడి చేస్తే.. 7306299999కి ఫోన్ చేయండి... నారా లోకేష్
నారా లోకేష్..(Image: Facebook)
TDP Protection cell | వైసీపీ నేతల నుంచి బెదిరింపులు, దాడులు జరిగితే టీడీపీ కార్యకర్తలు 7306299999 నెంబర్‌కి ఫోన్ చేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపునిచ్చారు
తెలుగుదేశం పార్టీ కార్యకర్తల రక్షణ కోసం ప్రత్యేక సెల్‌ను ఆ పార్టీ ఏర్పాటు చేసింది. వైసీపీ నేతల నుంచి బెదిరింపులు, దాడులు జరిగితే టీడీపీ కార్యకర్తలు 7306299999 నెంబర్‌కి ఫోన్ చేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ వేధించినా సరే.. ఈ నెంబర్‌కు ఫోన్ చేయాలని నారా లోకేష్ కోరారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయని లోకేష్ ఆరోపించారు. 40 రోజుల్లో వంద చోట్ల దాడులు జరిగాయన్నారు. వైసీపీ నేతల దాడిలో గాయపడిన,చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు భరోసా యాత్ర చేపట్టనున్నారు. టీడీపీ కార్యకర్తలకు న్యాయపరమైన, చట్టపరమైన సాయం అందిస్తామని లోకేష్ చెప్పారు. టీడీపీ కార్యకర్తల రక్షణ కోసం ప్రతి జిల్లాలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తామన్నారు. వైసీపీ ఎన్ని దాడులు చేసినా.. టీడీపీ కార్యకర్తలు సంయమనంతో వ్యవహరించాలని లోకేష్ సూచించారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.