TDP EX MP JC DIWAKAR REDDY CONDITION TO BJP TO SWITCH PARTY BA
బీజేపీలో చేరడానికి జేసీ పెట్టిన భారీ కండిషన్...
జేసీ దివాకర్ రెడ్డి
తాను బీజేపీలో చేరాలంటే ఆ పార్టీ పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను భారత్‌లోకి మళ్లీ తీసుకురావాలని అనంతపురం మాజీ ఎంపీ, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి కండిషన్ పెట్టారు.
తాను బీజేపీలో చేరాలంటే ఆ పార్టీ పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను భారత్‌లోకి మళ్లీ తీసుకురావాలని అనంతపురం మాజీ ఎంపీ, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి కండిషన్ పెట్టారు. పీఓకేను భారత్ మళ్లీ ఇండియాలో కలిపితే అప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు జై కొడతానన్నారు. గత కొంతకాలంగా ఆయన టీడీపీని వీడి బీజేపీలో చేరతారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఆయన బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ను జేసీ దివాకర్ రెడ్డి కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ క్రమంలో జేసీ దివాకర్ రెడ్డి పార్టీ మార్పు వార్తల మీద స్పందించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే జాతీయ పార్టీలు కీలకం అని చెప్పారు. అయితే, ప్రాంతీయ పార్టీలు అనేవి ఉన్నంతకాలం తాను టీడీపీలోనే ఉంటానని కూడా స్పష్టం చేశారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత తనను టార్గెట్ చేస్తున్నారని, తన ట్రావెల్స్ బస్సుల మీద దాడులు చేసి మూయించేస్తున్నారని జేసీ ఆరోపించారు. తాజాగా పోలీసుల మీద జేసీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఆయన్ను ఇరకాటంలో పెట్టాయి. జగన్ మాట వింటూ తనను టార్గెట్ చేస్తున్నారని, టీడీపీ ప్రభుత్వం వచ్చాక తన బూట్లు నాకే పోలీసులను పెట్టుకుంటానంటూ పోలీసుల మీద జేసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మరోవైపు జేసీకి కండిషన్ బెయిల్ విషయంలో కూడా ఈనెల 4వ తేదీన అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్లో రచ్చ జరిగింది. జేసీని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టిన పోలీసులు సుమారు ఆరు గంటలపాటు పేపర్లు పరిశీలిస్తున్నామని చెప్పడంతో స్టేషన్ బయట ఆయన అనుచరులు ఆందోళన చేపట్టారు. ఓ కార్యకర్త ఏకంగా ఆత్మహత్యాయత్నం చేశారు. పోలీసుల వ్యవహారశైలి మీద ఫిర్యాదు చేసేందుకు జేసీ దివాకర్ రెడ్డి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్ రెడ్డిని రేపు కలిసే అవకాశం ఉంది.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.