టీడీపీలో ఉండను... చంద్రబాబు బృందానికి మాజీ ఎమ్మెల్యే షాక్

కొంతకాలంగా టీడీపీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్న తోట త్రిమూర్తులు... త్వరలోనే వైసీపీలో చేరే అవకాశం ఉందని ఊహాగానాలు జోరందుకున్నాయి.

news18-telugu
Updated: September 13, 2019, 12:38 PM IST
టీడీపీలో ఉండను... చంద్రబాబు బృందానికి మాజీ ఎమ్మెల్యే షాక్
తెలుగుదేశం పార్టీ లోగో
  • Share this:
టీడీపీని వీడేందుకు మాజీ ఎమ్మెల్యే సిద్ధమయ్యారు. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత తోట త్రిమూర్తులు పార్టీని వీడతారని కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో అనుచరులు, శ్రేయోభిలాషులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తన రాజకీయ భవిష్యత్తు, పార్టీ మార్పు అంశంపై తోట త్రిమూర్తులు వారితో చర్చించారు. అయితే సందర్భంగా టీడీపీ అధిష్టానం తోట త్రిమూర్తులు పార్టీ మారకుండా ఉండేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని సమాచారం. చంద్రబాబు దూతగా తోటతో చర్చించేందుకు జ్యోతుల నెహ్రూ బృందం చర్చించినట్టు తెలుస్తోంది.

అయితే తాను పార్టీ మారాలని నిర్ణయించుకున్నానని... టీడీపీలో ఉండబోనని ఆయన వారికి తేల్చిచెప్పినట్టు వార్తలు వినిపించాయి. కొద్దిరోజుల క్రితం కాకినాడలో చంద్రబాబు నిర్వహించిన సమావేశానికి డుమ్మా కొట్టిన తోట త్రిమూర్తులు... పార్టీ అధినేత స్వయంగా ఫోన్ చేసినా స్పందించలేదని తెలుస్తోంది. కొంతకాలంగా టీడీపీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్న తోట త్రిమూర్తులు... త్వరలోనే వైసీపీలో చేరే అవకాశం ఉందని ఊహాగానాలు జోరందుకున్నాయి. పార్టీ మారేందుకు తోట త్రిమూర్తులు సుముఖంగా ఉన్నారని... ఇందుకు సంబంధించి ఆయన వైసీపీ నేతలతో చర్చలు కూడా జరుపుతున్నారని టీడీపీ నేతలు భావిస్తున్నారు. మరోవైపు తోట త్రిమూర్తులుకు వైసీపీ అధినాయకత్వం పార్టీ జిల్లా అధ్యక్ష పదవి ఆఫర్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది.


First published: September 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు