జగన్‌పై అనుచిత వ్యాఖ్యల కేసు.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్

సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణను పోలీసులు అరెస్ట్ చేశారు.

news18-telugu
Updated: October 18, 2019, 3:55 PM IST
జగన్‌పై అనుచిత వ్యాఖ్యల కేసు.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్
కలమట వెంకటరమణ, (File)
news18-telugu
Updated: October 18, 2019, 3:55 PM IST
టీడీపీ మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్యేగా సేవలు అందించారు. ఇటీవల కొత్తూరు మండలంలోని ఓ ప్రభుత్వ భవనానికి వైసీపీ రంగులు వేస్తుండగా వెంకటరమణ అడ్డుకున్నారు. తన అనుచరులతో కలసి నిరసనకు దిగారు. ఆ సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నాగరాజు అనే వ్యక్తి వెంకటరమణ, ఆయన అనుచరులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీఐ రవిప్రసాద్ నేతృత్వంలో కొందరు పోలీసులు మాతల గ్రామం వెళ్లారు. మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ, ఆయన కుమారుడు సాగర్ సహా 17మందిని అరెస్ట్ చేశారు.

First published: October 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...