పోలీసులపై జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

పోలీసులపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

news18-telugu
Updated: January 18, 2020, 2:24 PM IST
పోలీసులపై జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
జేసీ ప్రభాకర్ రెడ్డి(ఫైల్ ఫోటో)
  • Share this:
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వస్తే... తమపై అక్రమ కేసులు పెట్టిన పోలీసులు కూడా జైలుకెళ్తారని ఆయన వ్యాఖ్యానించారు. తాము అధికారంలోకి రావొద్దని పోలీసులు గట్టిగా మొక్కుకోవాలని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. పోలీసుల యాక్షన్‌కు మా రియాక్షన్‌ కచ్చితంగా ఉంటుందని జేసీ ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. కేసులు పెట్టి లోపలేయడం తప్ప... పోలీసులు ఏం చేయలేరని అన్నారు. తాడిపత్రిలో ప్రతి టీడీపీ కార్యకర్తకు అండగా ఉంటామని జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు.

కొద్దిరోజుల క్రితం పోలీసులపై జేసీ ప్రభాకర్ రెడ్డి సోదరుడు, అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సైతం ఇదే రకమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బూట్లు నాకే పోలీసులను పెట్టుకుంటానంటూ జెసీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై మండిపడ్డ పోలీసు అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు త్రిలోక్.. టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి పై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. జెసీపై 153, 506 సెక్షన్ల కింద అనంతపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
First published: January 18, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు