టీడీపీకి షాక్.. మాజీ ఎమ్మెల్యే గుడ్‌బై.. చంద్రబాబుకు లేఖ...

తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్ రావు పార్టీకి గుడ్ బై కొట్టారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు పంపారు.

news18-telugu
Updated: December 6, 2019, 7:08 PM IST
టీడీపీకి షాక్.. మాజీ ఎమ్మెల్యే గుడ్‌బై.. చంద్రబాబుకు లేఖ...
తెలుగుదేశం పార్టీ లోగో
  • Share this:
తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్ రావు పార్టీకి గుడ్ బై కొట్టారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు పంపారు. నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి నమ్మిన వ్యక్తి బీద మస్తాన్ రావు. గత ఏడాది ఆయన వ్యాపారాల మీద ఐటీ దాడులు జరిగాయి. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో నెల్లూరు లోక్‌సభ స్థానం నుంచి బీదమస్తాన్ రావు పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి మీద పోటీచేసి 1,48,571 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. అయితే, ఆ తర్వాత రాజకీయ పరిణామాల్లో ఆయన మీద ఒత్తిడి వచ్చినట్టు తెలుస్తోంది. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.

బీద మస్తాన్ రావు రాజీనామా లేఖ


బీద మస్తాన్ రావు ఏ పార్టీలో చేరతానేది ఇంకా క్లారిటీ రాలేదు. బీజేపీలో చేరతారని కొందరు, వైసీపీలో చేరే అవకాశం ఉందని మరికొందరు చెబుతున్నారు. ఏపీ, తమిళనాడుతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా బీద మస్తాన్‌రావుకు వ్యాపారాలు ఉన్నాయి. బీద మస్తాన్ రావు 2009 ఎన్నికల్లో నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2014 ఎన్నికల్లో మళ్లీ అక్కడే పోటీ చేసి వైసీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో నెల్లూరు నుంచి పోటీ చేసి ఆదాల చేతిలో పరాజయం చెందారు.

First published: December 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>