టీడీపీకి గుడ్‌బై... వైసీపీ కండువా కప్పుకొన్న మాజీ ఎమ్మెల్యే...

టీడీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్ రావు వైసీపీలో చేరారు.

news18-telugu
Updated: December 7, 2019, 3:03 PM IST
టీడీపీకి గుడ్‌బై... వైసీపీ కండువా కప్పుకొన్న మాజీ ఎమ్మెల్యే...
బీద మస్తాన్ రావుకు వైసీపీ కండువా కప్పుతున్న సీఎం జగన్
  • Share this:
టీడీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్ రావు వైసీపీలో చేరారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసంలో బీద మస్తాన్ రావు సీఎం జగన్‌ను కలిశారు. అనంతరం పార్టీ కండువా కప్పిన జగన్.. మస్తాన్ రావును వైసీపీలోకి ఆహ్వానించారు. నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి నమ్మిన వ్యక్తి బీద మస్తాన్ రావు. గత ఏడాది ఆయన వ్యాపారాల మీద ఐటీ దాడులు జరిగాయి. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో నెల్లూరు లోక్‌సభ స్థానం నుంచి బీదమస్తాన్ రావు పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి మీద పోటీచేసి 1,48,571 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. బీద మస్తాన్ రావు 2009 ఎన్నికల్లో నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2014 ఎన్నికల్లో మళ్లీ అక్కడే పోటీ చేసి వైసీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో నెల్లూరు నుంచి పోటీ చేసి ఆదాల చేతిలో పరాజయం చెందారు.

Beeda Mastan Rao,Beeda Mastan Rao quits tdp,Beeda Mastan Rao news,Beeda Mastan Rao joining ysrcp,Beeda Mastan Rao joining bjp,Beeda Mastan Rao latest news,kavali ex mla Beeda Mastan Rao,బీద మస్తాన్ రావు,బీద మస్తాన్ రావు టీడీపీకి గుడ్ బై,కావలి మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్ రావు,బీద మస్తాన్ రావు తాజా వార్తలు,బీద మస్తాన్ రావు న్యూస్ తెలుగు,
బీద మస్తాన్ రావుకు వైసీపీ కండువా కప్పుతున్న సీఎం జగన్


బీద మస్తాన్‌రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు మేలు చేకూరుస్తున్నాయన్నారు. అనతి కాలంలోనే 80 శాతంపైగా ఎన్నికల హామీలను ముఖ్యమంత్రి అమలు చేస్తున్నారని ప్రశంసించారు. ఎలక్షన్‌ మ్యానిఫెస్టోను వైసీపీ భగవద్గీత, బైబుల్‌, ఖురాన్‌గా భావిస్తోందని అన్నారు. తనకు రాజకీయంగా ఎవరితోనూ వ్యక్తిగత విబేధాలు లేవని స్పష్టం చేశారు. బీద మస్తాన్‌రావు శుక్రవారం తెలుగుదేశం పార్టీతో పాటు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: December 7, 2019, 2:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading