TDP EX MINSTER KALA VENKATARAO FIRE ON ANDHRA PRADESH CM JAGAN NGS GNT
Andhra Pradesh: ఆంధకార ఆంధ్రప్రదేశ్ గా మార్చిన సీఎం జగన్ పాలన.. సర్కార్ తీరుపై కళా ఫైర్
సీఎం జగన్ మోహన్ రెడ్డి (File)
YCP VS TDP: తమ పాలనలో విద్యుత్ కాంతులతో దగదగా మెరిసిపోతున్నా ఆంధ్రప్రదేశ్ ను.. సీఎం జగన్ అంధకార ఆంధ్రాగా మార్చారని టీడీపీ నేత కళా వెంకట్రావ్ మండపడ్డారు.. ప్రజలపై సెప్టెంబర్ లో మరో భారం మోపేందుకు సిద్ధమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)ను చీకటి ఆంధ్రాగా మార్చిన ఘనత సీఎం జగన్ దే అన్నారు టీడీపీ మాజీ మంత్రి కళా వెంకట్రావు (Kala Venkatrao). ఏపీపై రెండున్నరేళ్లలోనే 9069 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీల భారం మోపిన సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) ఎన్నికల ముందు ఛార్జీలు పెంచను అని చెప్పిన ఆయన.. 4 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. ఇప్పుడు ఐదో సారి 3669 కోట్ల రూపాయలు పెంచడం మోసం కాదా? అని కళా వెంకటరావు నిలదీశారు. విద్యుత్ కొనుగోలు ఛార్జీలు తగ్గినా వినియోగదారులపై ఎందుకు ఛార్జీలు పెంచుతున్నారని ప్రశ్నించారు? అవినీతి, దుబారా అరికడితే విద్యుత్ ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఎందుకు వస్తోందన్నారు. ఏపీని అంధకార ఆంద్రప్రదేశ్ గా మారుస్తూ విద్యుత్ వెలుగులు లేకుండా చేస్తున్నారు. 2020 ఫిబ్రవరిలో 500 యూనిట్లు దాటిన వారిపై యూనిట్ పై 90 పైసలు పెంచి జగన్ రెడ్డి ప్రభుత్వం 1300 కోట్లు రూపాయల భారం ప్రజలపై మోపారని ఆవేదన వ్యక్తం చేశారు. 2020 ఏప్రిల్, మే నెలలో స్లాబులు మార్చి కరోనాతో అతలాకుతలైన ప్రజలపై మరోసారి విద్యుత్ ఛార్జీలు పెంచి రాష్ట్ర ప్రజలపై 1500 కోట్లు భారం మోపారున్నారు.
ఏపీ ప్రభుత్వం 2021, ఏప్రిల్ 1 నుంచి కొత్త టారిఫ్ ఆర్డర్ ను తీసుకొచ్చి.. కిలో వాట్ కు 10 రూపాయల ఛార్జీలతో 20 శాతం ఛార్జీల ను పెంచిందన్నారు. స్థిర ఛార్జీలు లేవంటూనే కిలోవాట్ కు 10 రూపాయల వడ్డనతో 20 శాతం బిల్లులు పెంచారన్నారు. దీంతో వినియోగదారులపై దాదాపు 2600 కోట్ల రూపాయల వరకు భారాన్ని మోపారని కళా మండిపడ్డారు. ఆ తరువాత ప్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్ మెంట్ పేరుతో ప్రతీ మూడు నెలలకు ఒకసారి పెరిగిన విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని ప్రజల వద్ద నుండి వసూలు చేస్తున్నారని మండిపడ్డారు.
అసలే కరోనా ప్రభావంతో అన్ని వర్గాల ప్రజలు ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, ఆస్తిపన్ను, చెత్తపన్ను, నిత్యవసరాల ధరలు పెరిగి బ్రతుకే భారంగా మారిన పరిస్థితుల్లో విద్యుత్ ఛార్జీల భారం కూడా ప్రజలపై పడుతోంది. పెంచుతున్న ఛార్జీలు సెప్టంబర్ నుంచే అమలులోకి రానున్నాయి. వ్యవసాయం సంక్షోభంలో ఉన్నా అప్పుల కోసం మోటార్లకు మీటర్లు పెడుతున్నారు. ఇది రైతులకు ఉరితాడు బిగించడమే అవుతుంది. ఇతర రాష్ట్రాలకన్నా మన రాష్ట్రంలోనే విద్యుత్ రేట్లు ఎక్కువగా ఉన్నందున ఈ రాష్ట్రంలోకి పరిశ్రమలు రావు. నిరుద్యోగం మరింత పెరుగుతుంది. వైసీపీ నేతల లూటీకి, దుబారాకు విద్యుత్ వినియోగదారులు మోయలేని భారాలు మోయాలా? విద్యుత్ కొనుగోలు ఛార్జీలు తగ్గుతున్నా వినియోగదారులపై భారం మోపుతున్నారని కళా వెంకట్రావు మండిపడ్డారు. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ లో వచ్చిన అధునాతన టెక్నాలజీతో విద్యుత్ కొనుగోలు ధరలు తగ్గుతున్నాయి. ట్రాన్స్ మిషన్ కాస్ట్ లతో కలుపుకుని బహిరంగ మార్కెట్ లో సగటు యూనిట్ విద్యుత్ కొనుగోలు ధర 3 రూపాయల 12 పైసలకే లభిస్తోంది. అంతేకాకుండా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (పి.జి.సి.ఐ.ఎల్) నెట్ వర్క్ ను వినియోగించుకున్నందుకు వసూలు చేసే స్థిర ఛార్జీలు మెగావాట్ కు రూ. 5.5 లక్షల నుండి రూ. 3.5 లక్షలకు తగ్గించింది. దీని ద్వారా రాష్ట్రానికి రూ. 400 కోట్లు ఆదా అయ్యింది. కేంద్ర ఎనర్జీ మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వ 625 మెగావాట్ల థర్మల్ పవర్ భారాన్ని ఉపసంహరించుకోవడంతో ఏపీ డిస్కామ్ లకు మరో రూ .1007 కోట్ల ఆర్థిక భారం కూడా తగ్గిందన్నారు.
Published by:Nagesh Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.