Home /News /politics /

Gorantla meeting with Chandrababu: చంద్రబాబును కలిసిన గోరంట్ల.. రాజీనామాపై ఏమన్నారంటే?

Gorantla meeting with Chandrababu: చంద్రబాబును కలిసిన గోరంట్ల.. రాజీనామాపై ఏమన్నారంటే?

చంద్రబాబును కలిసిన గోరంట్ల

చంద్రబాబును కలిసిన గోరంట్ల

Gorantla meet party Chief: త్వరలోనే రాజీనామా చేసేస్తున్నా.. చంద్రబాబుతో మాట్లాడే ప్రసక్తే లేదు అన్న టీడీపీ సీనియర్ లీడర్, ఎమ్మెల్యే గోరంట్ల మనసు మార్చుకున్నారా..? అధినేత చంద్రబాబుకు ఆయన ఏం చెప్పారు..?

    Gorantla Back step: తెలుగుదేశం పార్టీ (Telugudesam Party)కి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని భావించిన రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే, ఆ పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి   (gorantla buchaiah chowdary) తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు.. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandra Babu Naidu) ని కలిసే ప్రసక్తే లేదు అన్న ఆయన.. ఇవాళ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. మంగళగరిగి (Magnalagiri)లోని ఎన్టీఆర్‌ భవన్‌ (NTR Bhavan)లో సమావేశం అయ్యారు. తన అభిప్రాయాలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. పార్టీలో పరిస్థితులపై ఇటీవల గోరంట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యనేతల సంప్రదింపులతో ఆయన ఇవాళ అధిష్ఠానం వద్దకు వెళ్లారు. చంద్రబాబుతో గోరంట్ల సమావేశమైన సమయంలో ఆయన వెంట పార్టీ నేతలు చిన రాజప్ప (Chinarajappa), నల్లమిల్లి (Nallamilli), గద్దె రామ్మోహన్ (G Rammohan)‌, జవహర్‌ (Jawahar) ఉన్నారు.

    కొన్ని రోజుల క్రితం.. పార్టీలో కొనసాగలేనంటూ కామెంట్ చేసిన ఆయన నిర్ణయం మార్చుకోవడంపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. పార్టీ తీరుపై చాలాకాలం నుంచి అసహనంతో ఉన్నారు. తనను ఎవరూ పట్టించుకోవడం లేదనే భావన కొంత.. రాజమండ్రి విషయంలో తన వర్గం కంటే ఎక్కువగా ఆదిరెడ్డి ఆప్పారావు వర్గానికి ప్రాధాన్యత పెరుగుతోందనే అభిప్రాయం మరికొంత ఆయనకు కోపం తెప్పించాయి. దీనికితోడు టీడీపీ పార్టీ నడుస్తున్న తీరును కూడా ఆయన బాహాటంగానే తప్పుబట్టారు.

    ఇదీ చదవండి: ఏపీ ప్రభుత్వానికి బిగ్ షాక్.. ఐదుగురు ఐఎఎస్ లకు జైలు శిక్ష.. ఎందుకంటే

    ఇన్నీ కారణాలు ఉండటంతో గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్రమైన నిర్ణయం ఏమైనా తీసుకుంటారా ? అనే చర్చ జరిగింది. తాను చంద్రబాబుతో మాట్లాడనని ఆయన కామెంట్ చేయడంతో విషయం చాలాదూరం వెళ్లిందనే ఊహాగానాలు వినిపించాయి. గత నెల 25లోపు ఈ విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటానని బుచ్చయ్య చౌదరి చెప్పడంతో.. ఆయన కఠినమైన నిర్ణయం ఏమైనా తీసుకుంటారా ? అనే చర్చ జరిగింది. కానీ అవన్నీ కేవలం ఊహాగానాలే అని తేలిపోయాయి.

    ఇదీ చదవండి: దానిపై వ్యామోహం లేదు.. నా టార్గెట్ ఒక్కటే.. ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

    అధిష్టానంపై గోరంట్ల బుచ్చయ్య చౌదరి అసంతృప్తికి గల కారణాలను తెలుసుకునేందుకు అధిష్టానం త్రిసభ్య కమిటీని నియమించింది. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌, మాజీ మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, కెఎస్‌.జవహర్‌లు ఇటీవల బుచ్చయ్యచౌదరి నివాసానికి వెళ్లి ఆయనతో చర్చలు జరిపారు. ఆ చర్చల తరువాత గోరంట్ల మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది.

    ఇదీ చదవండి:అన్నతో విబేధాలపై షర్మిల క్లారిటీ..? కన్నీరు వస్తోంది అంటూ భావోద్వేగ ట్వీట్.. ఏం చెప్పారంటే..?

    బుచ్చయ్యచౌదరి అభిప్రాయాలను పార్టీ అధినేత చంద్రబాబు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. త్వరలోనే అధినేతను కల్పిస్తామని హామీ ఇవ్వడంతో గోరంట్ల కాస్తా మెత్తపడ్డారు. దీంతో ఇవాళ చంద్రబాబు సమయం ఇవ్వడంతో ఆయనతో సమావేశం అయ్యారు. తన అభిప్రాయాలను చంద్రబాబుకు దృష్టికి తీసుకెళ్లారు.

    ఇదీ చదవండి ఏపీ ప్రభుత్వంలో లీకేజ్ రాయుళ్లు.. ఎలా ఆపాలో తెలియక టెన్షన్

    చంద్రబాబుతో భేటీ తరువాత తాను పార్టీలోనే ఉంటానని చెప్పినట్టు తెలుస్తోంది. పార్టీ నుంచి పూర్తి స్థాయి సహకారం అందుతుందని చంద్రబాబు హామీ ఇచ్చినట్టు సమాచారం. దీంతో టీడీపీలో చెలరేగిన ఈ వివాదం ఇక ముగిసినట్టే అని కేడర్ ఊపిరి పీల్చుకుంటున్నారు.
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, AP Politics, Chandrababu naidu, Tdp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు