Home /News /politics /

TDP EX MINISTER AYYANNAPATRUDU COMMENTS ON AP CM YS JAGANMOHAN REDDY AND MLA ROJA SELVAMANI BA

సీఎం జగన్, రోజాపై టీడీపీ మాజీ మంత్రి ఘాటు వ్యాఖ్యలు

సీఎం జగన్, ఎమ్మెల్యే రోజా (Image:RojaSelvamani/Facebook)

సీఎం జగన్, ఎమ్మెల్యే రోజా (Image:RojaSelvamani/Facebook)

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే రోజా సెల్వమణి మీద మాజీ మంత్రి, టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు.

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే రోజా సెల్వమణి మీద మాజీ మంత్రి, టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్‌కు పోయేకాలం దగ్గర పడిందని తీవ్రంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో తుగ్లక్ పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా తయారైందని విమర్శించారు. రాష్ట్రంలో పరిస్థితి మీద ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని అయ్యన్నపాత్రుడు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అయ్యన్నపాత్రుడు ఓ ప్రశ్న సంధించారు. ప్రతి దానికి తన మేనిఫెస్టో గురించి మాట్లాడే జగన్.. రాజధానిని మారుస్తానని మేనిఫెస్టోలో పెట్టారా? అని ప్రశ్నించారు.

    మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా మీద కూడా అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. మహిళలకు అన్యాయం జరిగితే గన్ కంటే ముందే జగన్ వస్తారని చెప్పిన రోజా ఇప్పుడు ఏమయ్యారని ప్రశ్నించారు. మహిళలకు ఏమైనా జరిగితే ఒంటికాలి మీద లేచే రోజా ఇప్పుడు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. అమరావతిలో మహిళా రైతుల మీద పోలీసులు దాడులు చేస్తుంటే ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. రాష్ట్రంలో మహిళల మీద దాడులు జరుగుతుంటే మహిళా హోంమంత్రి ఏం చేస్తున్నారని, ఎందుకు మాట్లాడడం లేదని అయ్యన్నపాత్రుడు కామెంట్ చేశారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Ap cm ys jagan mohan reddy, Ayyannapatrudu, MLA Roja

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు