TDP EX MINISTER AYYANNAPATRUDU CALLS YSRCP MP VIJAYASAI REDDY AS SCAM STAR BA
విజయసాయిరెడ్డికి కొత్త ‘స్టార్’ జోడించిన టీడీపీ నేత...
ఒకవేళ ఎన్డీఏలో వైసీపీ చేరాలి అని నిర్ణయించుకుంటే త్వరలో జరిగే మంత్రి వర్గ విస్తరణలో వైసీపీకి ఒకటి లేదా రెండు కేంద్రమంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. అదే జరిగితే రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి లేదా తిరుపతి ఉప ఎన్నికలో ఇటీవల గెలిచిన గురుమూర్తిలో ఒకరికి మంత్రి పదవి వస్తుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఇలాంటి మెసేజ్ లు వైరల్ గా మారాయి..
తెలుగుదేశం పార్టీ నేతలకు వైసీపీ నాయకులు, వైసీపీ నేతలకు టీడీపీ నాయకులు సోషల్ మీడియాలో రకరకాల ట్యాగ్లు తగిలిస్తూ ఉంటారు.
తెలుగుదేశం పార్టీ నేతలకు వైసీపీ నాయకులు, వైసీపీ నేతలకు టీడీపీ నాయకులు సోషల్ మీడియాలో రకరకాల ట్యాగ్లు తగిలిస్తూ ఉంటారు. అలాగే, ఇప్పుడు వైసీపీ రాజ్యసభ ఎంపీ వి.విజయసాయిరెడ్డికి కొత్త ‘స్టార్’ జోడించారు టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు. ఈమేరకు ఆయన వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు. ‘స్కాం స్టార్ విజయసాయిరెడ్డి స్కామ్స్ గురించి మాట్లాడటం విడ్డురంగా ఉంది. రూ.43 వేల కోట్లు కొట్టేసిన దొంగ రూ.900 కోట్ల ఈఎస్ఐ స్కాం అంటూ అల్లరి చేయడం విచిత్రం. టెలీహెల్త్ సర్వీసెస్ లో జరిగింది రూ.3 కోట్ల కుంభకోణం అని విజిలెన్స్ రిపోర్ట్ లో ఉంది. అది కూడా ఆనాడు మంత్రి గా ఉన్న అచ్చెన్నాయుడు కి సంబంధం లేదని విజిలెన్స్ రిపోర్ట్ స్పష్టంగా చెబుతుంది. కేవలం జగన్ రెడ్డి రూ.లక్ష కోట్ల అవినీతి వెలికి తియ్యడంలో అచ్చెన్నాయుడు కుటుంబం కీలక పాత్ర పోషించింది అనే కక్ష, ఏడాది పాలనలో బీసీలకు జరుగుతున్న అన్యాయాలను బయట పెట్టినందుకు ఆక్రోశం మరో పక్క తోడయి ఒక్క రోజైనా బీసీ నేత అచ్చెన్నాయుడుని వారాంతంలో టెర్రరిస్ట్ లా అరెస్ట్ చేయించారు జగన్ గారు. మీరు పెట్టిన అక్రమ కేసులు నిలబడవు. కోర్టులు ఎన్ని మొట్టికాయలు వేసినా మీకు సిగ్గురాదు కదా సాయిరెడ్డి.’ అని అయ్యన్నపాత్రుడు ట్వీట్ చేశారు.
స్కాం స్టార్ @VSReddy_MP స్కామ్స్ గురించి మాట్లాడటం విడ్డురంగా ఉంది.43 వేల కోట్లు కొట్టేసిన దొంగ 900 కోట్ల ఈఎస్ఐ స్కాం అంటూ అల్లరి చేయడం విచిత్రం.టెలీహెల్త్ సర్వీసెస్ లో జరిగింది 3 కోట్ల కుంభకోణం అని విజిలెన్స్ రిపోర్ట్ లో ఉంది(1/3)#WeStandWithAtchannaidu#BCsHarassedByJagan
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.