స్పీకర్ ఎంపికపై సభలో టీడీపీపై... వైసీపీ ఎమ్మెల్యే సెటైర్

ప్రస్తుతం అధికార పక్షం ఆ సంప్రదాయాన్ని పాటించలేదన్నారు మాజీ మంత్రి అచ్చెంనాయుడు. దీనిపై కౌంటర్ ఇస్తూ నిజాలు మాట్లాడితే టీడీపీ నేతల తలకాయలు వేయిముక్కలవుతాయని ముని శాపం ఉందంటూ సెటైర్లు వేశారు వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి.

news18-telugu
Updated: June 13, 2019, 12:59 PM IST
స్పీకర్ ఎంపికపై సభలో టీడీపీపై... వైసీపీ ఎమ్మెల్యే సెటైర్
సభలో సీఎం జగన్, శ్రీకాంత్ రెడ్డి
news18-telugu
Updated: June 13, 2019, 12:59 PM IST
స్పీకర్ ఎన్నిక సందర్భంగా సభలో మాట్లాడిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడు.. వైసీపీపై కొన్ని విమర్శలు చేశారు. గతంలో జరిగిన పరిణామాల్ని ఒకసారి గుర్తు చేసుకోవాలని సభా నాయకుడితో పాటు.. సభలో సభ్యులకు ఆయన తెలిపారు. స్పీకర్ ఏకగ్రవీంగా ఎన్నికవ్వడం చాలా సంతోషమన్నారు. శాసనసభ ఎన్నిక జరిగేటప్పుడు... ప్రతిపక్ష పార్టీని ఒకసారి కలిసి స్పీకర్ ఎన్నికపై సమాచారం అందించాలన్నారు. మమ్మల్ని పిలిస్తే సంతోషించేవాళ్లమన్నారు. కానీ అది జరగలేదని భాద కలుగుతుందన్నారు. అచ్చెన్నాయుడు ఆ వ్యాఖ్యలు చేయగానే వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారన్నారు. గతంలో స్పీకర్ ఎన్నిక జరిగినప్పుడు మేం ఆ సంప్రదాయం పాటించామన్నారు.

కనీసం వైసీపీ తరపున ఒక్కరైనా వచ్చి ఆ మాట చెప్తే మేం సంతోషించేవాళ్లమన్నారు. సభాపతిని కూర్చోబెట్టే విషయంలో ప్రతిపక్ష నేతను పిలవలేదని ఆరోపించారు. స్పీకర్‌ను ఎంపిక చేసేటప్పుడు ప్రతిపక్షానికి సమాచరం ఇవ్వడం సంప్రదాయమన్నారు. కానీ ప్రస్తుతం అధికార పక్షం ఆ సంప్రదాయాన్ని పాటించలేదన్నారు మాజీ మంత్రి అచ్చెంనాయుడు. దీనిపై కౌంటర్ ఇస్తూ నిజాలు మాట్లాడితే టీడీపీ నేతల తలకాయలు వేయిముక్కలవుతాయని ముని శాపం ఉందంటూ సెటైర్లు వేశారు వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి.  

అందుకే టీడీపీ నేతలు ఎవరూ కూడా నిజాలు మాట్లాడరని చురకలంటించారు శ్రీకాంత్. ఏదైనా సరే రాజకీయం చేయాలన్న కోణంలోనే మాట్లాడతారని విమర్జవలు చేశారు. ప్రొటెం స్పీకర్ అధికార, ప్రతిపక్షాలని స్పీకర్‌ను కూర్చొబెట్టాలని విన్నవించిన తర్వాత కూడా వినిపించుకోలేదన్నారు.ఇప్పుడైన మారి కొన్ని వాస్తవాలు మాట్లాడాలని ప్రతిపక్ష నేతకు విజ్ఞప్తి చేస్తున్నా అన్నారు శ్రీకాంత్ రెడ్డి.

First published: June 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...