బీజేపీలోకి వెళుతున్నా... చంద్రబాబుకు మాజీమంత్రి క్లారిటీ !

గత ఎన్నికల్లో ఓటమి కారణంగా పలు విధాలుగా ఇబ్బందుల్లో ఉన్న మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి... టీడీపీని వీడాలనే నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

news18-telugu
Updated: September 11, 2019, 2:54 PM IST
బీజేపీలోకి వెళుతున్నా... చంద్రబాబుకు మాజీమంత్రి క్లారిటీ !
చంద్రబాబు నాయుడు (File Photo)
  • Share this:
ఏపీలో టీడీపీ నుంచి బీజేపీలోకి వలసలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వీటిని అడ్డుకునేందుకు టీడీపీ నాయకత్వం ప్రయత్నాలు చేస్తున్నా... వారి ప్రయత్నాలు అంతగా ఫలించడం లేదని తెలుస్తోంది. తాజాగా మాజీమంత్రి, కడప జిల్లా టీడీపీ నేత ఆదినారాయణరెడ్డి టీడీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరతారని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఆయన మాత్రం ఎక్కడా మాట్లాడిన సందర్భాలు లేవు. మరోవైపు మంత్రి ఆదినారాయణరెడ్డి పార్టీ వీడకుండా ఉండేందుకు టీడీపీ నేతలు కూడా తమ వంతు ప్రయత్నాలు చేసినట్టు జిల్లా రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

అయితే ఓటమి కారణంగా పలు విధాలుగా ఇబ్బందుల్లో ఉన్న మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి... టీడీపీని వీడాలనే నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఆయన స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబుకు కూడా స్పష్టం చేశారని సమాచారం. ఎంపీగా పోటీ చేయడం కారణంగా తాను నష్టపోయాయని చంద్రబాబు దగ్గర ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. కడపలో వైసీపీని ఎదుర్కోవాలంటే బీజేపీలో చేరడమే మంచిదనే ఆలోచనకు వచ్చిన ఆదినారాయణరెడ్డి... ఈ నెలలోనే బీజేపీ గూటికి చేరే అవకాశం ఉందని కడప జిల్లా రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.First published: September 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు