Home /News /politics /

TDP EX LEADER AMBIKA KRISHNA SENSATIONAL COMMENTS ON NARA LOKESH AK

లోకేశ్‌ను కలవడం కష్టం...బాలకృష్ణకు చెప్పా... టీడీపీ మాజీ నేత సంచలన వ్యాఖ్యలు

బాలకృష్ణ, నారా లోకేష్

బాలకృష్ణ, నారా లోకేష్

Nara Lokesh | తమలాంటి వారితో పాటు పలువురు మంత్రులు కూడా లోకేశ్‌ను కలవలేకపోతున్నామనే ఆవేదన ఉండేదని టీడీపీ మాజీ నేత అంబికా కృష్ణ వ్యాఖ్యానించారు.

    టీడీపీ ముఖ్యనేత, చంద్రబాబు తనయుడు నారా లోకేశ్‌పై ఆ పార్టీ మాజీ నాయకుడు అంబికా కృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల బీజేపీలో చేరిన అంబికా కృష్ణ... టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో లోకేశ్‌ను కలవడం సాధ్యం అయ్యేదికాదని వెల్లడించారు. తమలాంటి వారితో పాటు పలువురు మంత్రులు కూడా లోకేశ్‌ను కలవలేకపోతున్నామనే ఆవేదన ఉండేదని వ్యాఖ్యానించారు. చంద్రబాబును సైతం కలిసి అనేక అంశాలపై మాట్లాడే వాళ్లమని... కానీ లోకేశ్‌ను కలవడం మాత్రం సాధ్యపడలేదని అంబికా కృష్ణ అన్నారు. నాయకులకు అందుబాటులో లేకపోవడం అనేది లోకేశ్‌కు పెద్ద మైనస్ అని ఆయన అభిప్రాయపడ్డారు.

    లోకేశ్ ఎంతో మారాల్సి ఉందన్న అంబికా కృష్ణ... ఆయన తెలివైన వ్యక్తి అని అన్నారు. అయితే ఆయన ఆలోచనలను ఆచరణలో పెట్టే విషయంలోనే లోపాలు జరుగుతున్నాయని అన్నారు. ఆయన చూట్టూ ఉండేవారు కూడా ఇందుకు కారణం కావొచ్చని అంబికా కృష్ణ అభిప్రాయపడ్డారు. అయితే తన తీరు మార్చుకుని ముందుకు సాగితే... లోకేశ్ మంచి నాయకుడిగా ఎదుగుతారని అన్నారు. తాను పార్టీ మారే విషయాన్ని చంద్రబాబుకు చెప్పలేదన్న అంబికా కృష్ణ... బీజేపీలో చేరుతున్నానని బాలకృష్ణకు స్పష్టం చేశానని తెలిపారు. బాలకృష్ణ కూడా తన నిర్ణయానికి అడ్డుచెప్పలేదని వ్యాఖ్యానించారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Balakrishna, Chandrababu naidu, Nara Lokesh, Tdp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు