ఏపీలో రాజకీయాలు వాడివేడిగా మారాయి. వల్లభనేని వ్యాఖ్యలతో ఏపీ పాలిటిక్స్ మరింత వేడెక్కాయి. వల్లభనేని వంశీ గత కొన్నిరోజులుగా పార్టీ మారుతారంటూ వార్తలు వినిపించాయి. ఈ మధ్యకాలంలోనే ఆయన వెళ్లి సీఎం జగన్‌ను సైతం కలిశారు. అయితే తాజాగా టీడీపీ అధినేత చంద్రబబు వంశీని పార్టీని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ వ్యవహారంపై వల్లభనేని వంశీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధినేత చంద్రబాబు దగ్గరనుంచి లోకేష్ సహా పలువురు పార్టీ సీనియర్లపై ఘాటైన విమర్శలు చేశారు.
తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై స్పందిస్తూ.. 'చంద్రబాబు చేసేదేంటి.. నేనే పనిచేయనని చెప్పి బయటకొచ్చేశా' అంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు అంత సీన్ లేదని.. పళ్లు కొరకడం తప్ప తననేమీ చేయలేరని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకి రోషం ఉంటే పార్టీ మారిన రాజ్యసభ సభ్యులను సస్పెండ్ చేయాలన్నారు. జూ.ఎన్టీఆర్‌కి,నారా లోకేశ్‌కి నక్కకు నాగ లోకానికి ఉన్నంత తేడా ఉందని ఎద్దేవా చేశారు.లోకేశ్‌కి పనిలేక సోషల్ మీడియా వింగ్స్ నడుపుకుంటూ కూర్చుంటున్నాడని విమర్శించారు.
అయితే వంశీ చేస్తున్న ఈ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. రాజేంద్రప్రసాద్, బోడెప్రసాద్‌పై చేసిన వ్యాఖ్యలకు గానే... బోడె ప్రసాద్ స్పందించారు. తాను రాజేంద్ర ప్రసాద్‌కు ఎలాంటి డబ్బులు ఇవ్వలేదన్నారు. వంశీ తనపై చేసిన ఆరోపణల్ని ఆయన ఖండించారు. మరికొందరు టీడీపీ నేతలు కూడా వంశీ వ్యాఖ్యలు సరికాదన్నారు. వంశీ వెనుక జగన్ ఉండి ఇలా మాట్లాడిస్తున్నారని విమర్శించారు. వంశీని జగన్ పావులా వాడుకుంటున్నారనన్నారు. నిమిషనిమిషానికి అభిప్రాయాలు మార్చుకోవవద్దంటూ వంశీకి హితవు పలికారు. వాస్తవాలు తెలుసుకోకుండా నిందలు వేయడం సరికాదన్నారు.
Published by:Sulthana Begum Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.