నందమూరి ఫ్యామిలీకి టీడీపీ అంతగా కలిసిరాలేదా..?

టీడీపీ చరిత్రను పరిశీలిస్తే నందమూరి ఫ్యామిలీకి ఆ పార్టీ అంతగా కలిసిరాలేదా? అంటే అవునంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆ దెబ్బ టీడీపీని స్థాపించిన సీనియర్ ఎన్టీఆర్‌‌పైనే తొలుతగా పడిందని చెబుతున్నారు.

news18-telugu
Updated: November 19, 2019, 2:05 PM IST
నందమూరి ఫ్యామిలీకి టీడీపీ అంతగా కలిసిరాలేదా..?
టీడీపీ, సీనియర్ ఎన్టీఆర్
  • Share this:
అది 1982 మార్చి 29.. తెలుగు ప్రజల, జాతి ఆత్మగౌరవ పునరుద్ధరణ అంటూ సినీనటుడు, నటరత్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అప్పటిదాకా ఏకపక్షంగా పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీగా అవతరించింది. అప్పటి దాకా సినిమాల్లో అప్రతిహత విజయాలతో దూసుకుపోయిన ఆయన.. పార్టీ పెట్టి 9 నెలల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అప్పట్లో 42 లోక్‌సభ స్థానాలకు గానూ 35 గెలుచుకొని ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. 1988లో పార్టీ ఓడిపోయింది. మళ్లీ 1994లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. రెండో సారి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. తదుపరి టీడీపీలో చోటుచేసుకున్న కొన్ని పరిణామాలతో 1995లో చంద్రబాబు అధికారం చేపట్టాల్సి వచ్చింది. అప్పటి నుంచి టీడీపీని చంద్రబాబునాయుడే ఏలుతున్నారు. అయితే.. ఇక్కడ టీడీపీ చరిత్రను పరిశీలిస్తే నందమూరి ఫ్యామిలీకి ఆ పార్టీ అంతగా కలిసిరాలేదా? అంటే అవునంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆ దెబ్బ టీడీపీని స్థాపించిన సీనియర్ ఎన్టీఆర్‌‌పైనే తొలుతగా పడిందని చెబుతున్నారు.

ఆ పార్టీ చరిత్రను పరిశీలిస్తే.. సీనియర్ ఎన్టీఆర్ తర్వాత నందమూరి వారసులు చాలామందే పార్టీకి సేవలు అందించారు. ఎన్టీఆర్ తర్వాత ఆయన సతీమణి లక్ష్మీ పార్వతి, తనయులు హరికృష్ణ, బాలకృష్ణ, హరికృష్ణ కుమారుడు జూనియర్ ఎన్టీఆర్, తనయ సుహాసిని.. ఇలా అందరూ పార్టీ కోసం పనిచేశారు. అయితే.. ఇందులో ఎవ్వరికీ కలిసిరాలేదనే చెప్పాలని అంటున్నారు రాజకీయ పండితులు. హరికృష్ణ మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా పనిచేసినా.. రావాల్సిన గుర్తింపు రాలేదని, లక్ష్మీ పార్వతి సంగతి వేరే చెప్పక్కర్లేదని చెబుతున్నారు. ఆమెను పార్టీ నుంచే బహిష్కరించారని గుర్తు చేస్తున్నారు.

ఇక, ఎన్టీఆర్ అల్లుడు దగ్గుబాటి వేంకటేశ్వర్‌రావు కూడా కొన్నాళ్లు పార్టీ కోసం పని చేశారని, ఆ తర్వాత ఆయన ఆ పార్టీ వీడాల్సి వచ్చిందని వివరిస్తున్నారు విశ్లేషకులు. అన్నింటికంటే.. మాస్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ భవిష్యత్తు క్రియాశీలక రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తారని అందరూ భావించారు. అందుకు తగ్గట్లే 2009 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం నిర్వహించాడు యంగ్ టైగర్. అయితే.. ఆ తర్వాత రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యాడు. తాజాగా.. జూనియర్ ఎన్టీఆర్ సేవలు టీడీపీకి అవసరం లేదని చంద్రబాబు సన్నిహితుడు వర్ల రామయ్య వ్యాఖ్యానించారంటేనే ఆయన పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చని విశ్లేషకులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అటు.. సుహాసిని కూడా 2018 ముందస్తు ఎన్నికల్లో కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి దారుణ ఓటమిని చవిచూశారు. ఇదిలా ఉండగా.. నటసింహం బాలకృష్ణ ఒక్కడే ఇప్పుడు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే.. టీడీపీలో ఈయన కూడా నామమాత్రమే అని చెప్పాలని అంటున్నారు రాజకీయ అనలిస్టులు. నటనలో ఆరితేరిన సింహంగా మాత్రమే ఆయనకు ఛరిష్మా ఉందిగానీ.. టీడీపీ వల్ల వచ్చిన లాభం ఏమీలేదని స్పష్టం చేస్తున్నారు.

First published: November 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...