Home /News /politics /

TDP DEPEND ON SOCIAL MEDIA CAMPAIGN IN TIRUPATI LOKSABHA BY POLL NGS TPT

Tirupati Loksabha by-poll: తిరుపతిలో తాడిపత్రి వ్యూహం: ఉప ఎన్నికలో గెలుపు కోసం టీడీపీ డిజిటల్ ప్రచారం

సేవ్ తిరుపతి నినాదంతో ముందుకెళ్తున్న టీడీపీ

సేవ్ తిరుపతి నినాదంతో ముందుకెళ్తున్న టీడీపీ

తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో టీడీపీ ట్రెండ్ మార్చింది. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా ప్రచారాన్ని ముమ్మరం చేసింది. సేవ్ తిరుపతి నినాదంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి వెబ్ సైట్, యాప్ లను కూడా అందుబాటులోకి తెచ్చారు టీడీపీ నేతలు. మరీ సేవ్ తిరుపతి నినాదం ఎంత వరకు పని చేస్తుందో చూడాలి.

ఇంకా చదవండి ...
    తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో  సేవ్ తిరుపతి నినాదం వైరల్ అవుతోంది. వరుస ఎన్నికల్లో పరాజయాలతో ఢీలా పడ్డ టీడీపీ.. తిరుపతి ఉప ఎన్నిక ద్వారా ఉనికి చాటుకోవాలని ఆరాటపడుతోంది. ఎలాగైనా విజయం సాధించాలని వ్యూహాలు రచిస్తోంది. అందుకే సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటోంది. లోక్ సభ ఉప ఎన్నిక కావడంతో విద్యావంతులు, యువత ఓటర్లలో ఎక్కువమంది ఉన్నారు. దీంతో డిజిటిల్ మీడియా వేదికగానే ప్రచారంలో దూకుడు పెంచింది. యాప్, వెబ్ సైట్ తో ప్రజలకు చేరువైయ్యే ప్రయత్నం చేస్తోంది.

    దివంగత బల్లి దుర్గ ప్రసాద్ మరణంతో తిరుపతి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పుడు పోటీలో ఉన్న ప్రధాన పార్టీలన్నీ వివిధ వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. ఎటు చూసినా కార్యకర్తల ప్రచారంతో తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గం హోరెత్తుతోంది. తిరుపతి ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకోవడం కోసం అన్ని పార్టీలు ప్రత్యర్థులపై మాటల యుద్ధం చేస్తున్నాయి. అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు.. టీడీపీ, బీజేపీ పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా దూసుకుపోతున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రజలకు చేరువైయ్యే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నాయి. ఈ క్రమంలో
    నయా ఆలోచనకు టీడీపీ నాంది పలికింది.

    ప్రజలకు చేరువయ్యే దిశగా ప్రతిపక్ష పార్టీ సోషల్ మీడియాను వేదికగా చేసుకుంది. ఇప్పటికే బీజేపీ సైతం ఎక్కువగా డిజిటల్ మీడియాపైనే ఫోకస్ చేసింది. ఇప్పుడు టీడీపీ సోషల్ మీడియాలో మరింత దూసుకుపోయే విధంగా కసరత్తు చేసి సక్సెస్ అయ్యింది. ప్రస్తుతం బీజేపీ కంటే ఈ అంశంలో ముందడుగు వేస్తోంది టీడీపీ. మరోవైపు ఇటీవల మున్సిపాలిటీ ఎన్నికల్లో ఏపీ వ్యాప్తంగా వైసీపీ ప్రభంజనం కొనసాగింది. కానీ తాడిపత్రి, మైదుకూరుల్లో మాత్రమే టీడీపీ, అధికార పార్టీ కంటే ఎక్కువ వార్డులను సొంతం చేసుకుంది. అయితే తాడిపత్రిలో మాత్రమే చైర్మన్ పదవిని నిలుపుకోగలిగింది. ఆ ఒక్క సీటు ఇచ్చిన స్ఫూర్తిని తిరుపతిలో అమలు చేస్తోంది. తాడిపత్రిలో టీడీపీ విజయం సాధించడానికి ప్రధాన కారణం స్థానిక నాయకత్వంతో పాటు.. సేవ్ తాడిపత్రి నినాదామే. వైసీపీ చైర్మన్ పదవి గెలిస్తే తాడిపత్రిని నాశనం చేస్తారని.. టీడీపీ గెలిస్తేనే మన తాడిపత్రిని కాపాడుకుంటామని జేసీ బ్రదర్స్ గట్టిగా ప్రచారం చేశారు. ఇప్పుడు అదే వ్యూహంతో సేవ్ తిరుపతి నినాదంతో టీడీపీ ముందుకెళ్తోంది.

    సేవ్ తిరుపతి యాప్, వెబ్ సైట్ తో పాటుగా.. టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులో ఉంచింది టీడీపీ. ఈ వెబ్ సైట్ ను.. తిరుపతి పార్టీ కార్యాలయంలో జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు.

    తిరుపతి పవిత్రతను అధికార పార్టీ దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తోందని ఈ వెబ్ సైట్, యాప్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లనుంది. ఈ వెబ్ సైట్ సక్సస్ అయితే.. సేవ్ తిరుపతి లాగే సేవ్ ఏపీ అనే నినాదంతో ముందుకు వెళ్లేందుకు టీడీపీ సంసిద్ధం అవుతోంది. 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో, కిరణ్ కుమార్ రెడ్డి పాలనలో టీటీడీ అంశాలలో రాజాకీయ జోక్యం లేదని.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. పింక్ డైమండ్ పోయిందంటూ రమణదీక్షితులు, వైసీపీ నేతలు చేసిన వాఖ్యలపై అప్పట్లో టీటీడీ అధికారులు పరువు నష్టం కేసు కోర్టులో వేశారని... ప్రస్తుతం ఆ కేసు వెనక్కు తీసుకునేందుకు టీటీడీ పై అధికారులపై ఒత్తిడి తీసుకు వస్తున్నారని ఆరోపించారు. వైసీపీ పాలన వచ్చాక టీటీడీ ప్రతిష్ట దెబ్బతినిందని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతికి గతంలో ఒక ఎమ్మెల్యే ఉంటే ప్రస్తుతం ఆరుగురు అనధికార ఎమ్మెల్యేలు తయారై భూకబ్జాలు చేస్తున్నారని పేర్కొన్నారు. అధికార వైసీపీ అక్రమాలు తెలుసుకోవాలంటే... savetirupati.com సైట్ ను ప్రజలు సందర్శించాలని కోరారు. వైసీపీ పార్టీ బెదిరింపులకు దిగితే టోల్ ఫ్రీ నెంబర్ +91 8099975975 కు కాల్ చేయాలనీ కోరారు.
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Bjp-janasena, Tdp, Tirupati, Tirupati Loksabha by-poll, Ycp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు