3 రాజధానులకు వ్యతిరేకంగా ఢిల్లీలో టీడీపీ పావులు.. హోంశాఖ కార్యదర్శితో కీలక భేటీ

జరిగిన పొరపాటును హోంశాఖ కార్యదర్శి గ్రహించారని చెప్పుకొచ్చారు కనకమేడల. న్యాయశాఖ అభిప్రాయాలను తీసుకుని అవసరమైతే అఫిడవిట్‌లు సరిచేసుకునే విషయాన్ని పరిశీలిస్తామని అజయ్‌భల్లా హామీ ఇచ్చినట్లు చెప్పారు.

news18-telugu
Updated: September 14, 2020, 11:02 PM IST
3 రాజధానులకు వ్యతిరేకంగా ఢిల్లీలో టీడీపీ పావులు.. హోంశాఖ కార్యదర్శితో కీలక భేటీ
కేంద్రహోంశాఖ కార్యదర్శిని కలిసిన టీడీపీ ఎంపీలు
  • Share this:
పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ఏపీ మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఢిల్లీ స్థాయిలో గళమెత్తాలని టీడీపీ భావిస్తోంది. మూడు రాజధానులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడాన్ని ఆ పార్టీ తీవ్రంగా తప్పుబట్టుతోంది. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి ఢిల్లీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌భల్లాతో టీడీపీ ఎంపీలు సమావేశమయ్యారు. ఏపీ మూడు రాజధానుల అంశంలో ఇటీవల కేంద్ర హోంశాఖ హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌పై వివరణ కోరారు ఎంపీలు. రాజధాని ఎంపికపై కేంద్రం జోక్యం ఉండదని. అది పూర్తిగా రాష్ట్ర పరిధిలోని అంశమని కేంద్ర హోంశాఖ దాఖలు చేసిన అఫిడవిట్‌పై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమావేశం అనంతరం గల్లా జయదేవ్ మీడియాకు తెలిపారు.

మూడు రాజధానుల అంశం, కేంద్ర హోంశాఖ అఫిడవిట్‌పై తాము లేవనెత్తిన అభ్యంతరాలను అజయ్‌ భల్లా పరిశీలిస్తామని చెప్పినట్లు గల్లా వెల్లడించారు. కేంద్ర హోంశాఖ పూర్తిస్థాయిలో పరిశీలించకుండా హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసి ప్రజలను గందరగోళానికి గురిచేసిందని ఈ సందర్భంగా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ విమర్శించారు. న్యాయపరమైన అంశాలను హోంశాఖ కార్యదర్శికి వివరించి.. అఫిడవిట్‌లో పేర్కొన్న అంశాలను సరిచేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని గుర్తు చేశామని తెలిపారు. అంతేకాదు.. జరిగిన పొరపాటును హోంశాఖ కార్యదర్శి గ్రహించారని చెప్పుకొచ్చారు కనకమేడల. న్యాయశాఖ అభిప్రాయాలను తీసుకుని అవసరమైతే అఫిడవిట్‌లు సరిచేసుకునే విషయాన్ని పరిశీలిస్తామని అజయ్‌భల్లా హామీ ఇచ్చినట్లు చెప్పారు టీడీపీ ఎంపీ.

టీడీపీ ఎంపీల భేటీకి ముందు నర్సాపురం ఎంపీ, వైసీపీ రెబల్ లీడర్ రఘురామకృష్ణరాజు కూడా అజయ్‌భల్లాతో భేటీ అయ్యారు. హైకోర్టులో కేంద్రహోంశాఖ దాఖలు చేసిన అఫిడవిట్లను సమీక్షించాల్సిందిగా కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రానికి అమరావతి ఒక్కటే రాజధానిగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. రాజధాని రైతుల ఆందోళన, త్యాగాలు, ప్రభుత్వం ఇచ్చిన హామీలను పరిగణలోకి తీసుకొని అటార్నీ జనరల్ లేదా సొలిసిటర్‌ జనరల్ న్యాయ సలహాతో రాజధాని అంశంపై స్పందించాలని కేంద్రహోంశాఖను కోరానని చెప్పారు రఘురామ కృష్ణంరాజు. తన విజ్ఞప్తిపై అజయ్ భల్లా సానుకూలందా స్పందించినట్లు తెలిపారు.

కాగా, పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా సభలో గళం విప్పేందుకు టీడీపీ ఎంపీలు నిర్ణయించకున్నట్లు తెలుస్తోంది. విభజన చట్టం హామీలను ప్రస్తావిస్తూ.. అమరావతి శంకుస్థాపనకు మోదీ వచ్చిన విషయాన్ని సభా వేదికగా గుర్తు చేయాలని యోచిస్తున్నారు. అధికారం మారిన ప్రతీసారి రాజధానులను మార్చుతూ పోతే వేల కోట్ల ప్రజాధనం వృథాకావడంతో పాటు రాష్ట్రానికి ఎంతో నష్టం జరుగుతుందన్న వాదనను బలంగా వినిపించాలని వ్యూహాలను సిద్ధం చేసినట్లు సమాచారం.
Published by: Shiva Kumar Addula
First published: September 14, 2020, 10:56 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading